Take a fresh look at your lifestyle.

చేటు చేసిన అతిథి

కాలుష్యం కాటుకు బలైన

ఋతువులు గతులు తప్పగా,

అనుకోని అతిధిలా వచ్చిన వర్షాలు

కళ్ళాల్లోని పంటరాశుల నిధిని

దోపిడీ దొంగల్లా కొల్లగొట్టగా,

ఆరుగాలం కష్టాన్ని కోల్పోయి,

ఆశలమేడలు కూలిపోగా

హతాశుడైపోయాడు హాలికుడు.

 

నారు నాటిన నాటినుంచి,

చుక్కపడకజి

చుక్కలను చూపించిన రోజులనుంచి,

అరకొర వర్షాలతో ఆనందం ఇనుమడించ,

వేసిన విత్తు నకిలీది కాదన్న మోదం,

వాడిన ఎరువు కల్తీ కాదన్న ఆనందం

పైరు ఏపుగా పెరిగినప్పుడు కనపడగా,

రకరకాల తెగుళ్ళతో

అడుగడుగునా ఆటంకాలు,

మేడిపండు చందమే కర్షకుల బతుకులు.

 

స్వేదబిందువుల మధనంలో

ధాన్యలక్ష్మి విరగపండినా,

చేతికి అందొచ్చిన నాడే

కృషీవలుల కళ్ళల్లో

ఆనందం తాండవిస్తుంది.

 

– వేమూరి శ్రీనివాస్‌,తాడేపల్లిగూడెం.

Leave a Reply