దేహామంతా అల్లుకున్న ఆశలు
పెనేసుకునే తపనలతో
పరిచయమైన ప్రశ్నలన్నీ హెచ్చరికలే.
కాలుదువ్వే వయసులో
జమకాబడిన తీపిరోజుల్లో
అనుభవాల అపశ్రుతులన్నీ సవాళ్లే.
మనసు తవ్వకాల్లో
కన్నీటి చెమ్మ చెప్పిన కధలో
చివరి అంకమంతా చేదునిజాలే.
కాలమే కధానాయకుడుగా
కోరికలే ప్రతినాయకులుగా
జరిగే కధలో మనసు మోసం ఇష్టం.
బతుకు తెరపై
రంగురంగుల కలలు చిలికే
జీవన రంగంస్థలంపై
విషాదంత,సుఖంతాలకు
మనిషే ఓ కీలక పాత్ర
మనసుది ఓ క్రూర పాత్ర.
– చందలూరి నారాయణరావు,9704437247