బెంగుళూరు, మార్చి 11 : కర్నాటకు చెందిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ధృవనారాయణ కన్నుమూశారు. గుండెనొప్పి రావడంతో శనివారం ఉదయం 6.40 నిమిషాలకు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే ధృవనారాయణ ప్రాణాలు విడిచినట్లు డీఆర్‌ఎంఎస్ హాస్పిటల్ డాక్టర్ మంజునాథ్ తెలిపారు. ఛాతిలో నొప్పి రాగానే ఆయన డ్రైవర్‌కు ఫోన్ చేశాడు. కారులో తరలిస్తున్న సమయంలోనే ధృవనారాయణ రక్తం కక్కుకున్నట్లు తెలుస్తోంది.
తీవ్ర స్థాయిలో బ్లీడింగ్ జరిగింది. గతంలో ఆయన రెండుసార్లు లోక్‌సభ ఎంపీగా చేశారు. కర్నాటకలోని చామరాజనగర్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. బెంగుళూరులోని అగ్రికల్చర్ వర్సిటీ నుంచి ఆయన మాస్టర్స్ డిగ్రీ పొందారు. 1983లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అగ్రికల్చర్ కాలేజీలో స్టూడెంట్ లీడర్‌గా చేశారు. కర్నాటక యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కూడా చేశారు.