గాడి తప్పిన పది పరీక్షలు

‘ఈ ‌పరీక్షలు పిల్లలకు కాదు పిల్లల తల్లి తండ్రులకు బోధించే ఉపాధ్యాయులకు తల్లి తండ్రులు పరీక్ష కేంద్రాల వద్ద పిల్లలకు స్లిప్‌ ‌లు అందించే ప్రక్రియలో ఎండను సైతం లెక్క చేయకుండా శ్రమిస్తుఉంటే ఉపాధ్యాయులు అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో తల మునకలవుతున్నారు. కష్టపడి చదివి పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థుల తల్లి తండ్రులు మాత్రం ఈ మాస్‌ ‌కాపీయింగ్‌ ‌ప్రక్రియ చూసి ఆవేదనకు గురి అవుతున్నారు.’’

ఆంధ్రప్రదేశ్‌ ‌లో పది పరీక్షల నిర్వాకం

ఒకప్పుడు పదో తరగతి పరీక్షలలో ఉత్తీర్ణులు అయ్యారు అంటే చాలా గొప్పగా చూసే వారు..తృతీయ శ్రేణిలో పాస్‌ అయిన వారికి కూడా చాలా గుర్తింపు ఉండేది .అయితే నేటి పదో తరగతి పరీక్షలు తీరు చూస్తే పరీక్ష ఫెయిల్‌ అయ్యారు అంటే చాలా చిత్రంగా చూసే పరిస్ధితి ఏర్పడింది. కారణం అప్పటి కన్నా విద్యా ప్రమాణాలు పెరిగి మంచి ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అని మనం సమర్దించు కోవచ్చు.నిజమే విద్యా ప్రమాణాలు పెరిగాయి పిల్లల్లో మేధస్సు గతం కన్నా పెరిగింది.అయితే ఈ శాతం ఎంత ఉంది అనేది అంతర్మధనం చేసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఈనాడు ప్రతీ విద్యా సంస్ధలో నూరు శాతం పది ఫలితాలు రావడం అనేది విద్యార్థుల మేధస్సులో వచ్చిన పరిణితి వల్లనే సాధ్య పడుతుందా? కేవలం వారి ప్రతిభవల్లనే నూరు శాతం ఫలితాలు సాధ్యం అవుతున్నాయా అంటే సందేహమే ఒక అంచనా ప్రకారం ఈ తరహా ఉత్తీర్ణత 50 శాతం మించి ఉండదనే చెప్పొచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే.ఈ పరీక్షలు పిల్లలకు కాదు పిల్లల తల్లి తండ్రులకు బోధించే ఉపాధ్యాయులకు తల్లి తండ్రులు పరీక్ష కేంద్రాల వద్ద పిల్లలకు స్లిప్‌ ‌లు అందించే ప్రక్రియలో ఎండను సైతం లెక్క చేయకుండా శ్రమిస్తుఉంటే ఉపాధ్యాయులు అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో తల మునకలవుతున్నారు. కష్టపడి చదివి పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థుల తల్లి తండ్రులు మాత్రం ఈ మాస్‌ ‌కాపీయింగ్‌ ‌ప్రక్రియ చూసి ఆవేదనకు గురి అవుతున్నారు. అయితే ఈ తంతు కొత్తగా వచ్చిందేమీ కాదు గత కొన్నేళ్లుగా వ్యవస్థీకృతమైపోయిన ఈ మాస్‌ ‌కాపీయింగ్‌ ‌నేడు ఆంధ్రప్రదేశ్‌ ‌లో పతాకస్థాయికి చేరింది అంతే.దీనికి సాంకేతిక పరిజ్ఞానం మరింత తోడై చూచిరాతలలో నూతన వరవడిలు ఉపయోగిస్తు రచ్చ కెక్కింది.ఈ పరిస్ధితులు అన్నీ గమనిస్తున్న దిగువ తరగతి విద్యార్థులు మాత్రం భవిష్యత్‌ ‌లో తాము రాయబోయే పరీక్షలకు ఏ మాత్రం కష్ట పడవలసిన అవసరం లేదని మానసికంగా సిద్ధపడి పోతున్నారు.వీటి నిర్వహణలో ఈ దుస్ధితి ఏర్పడటానికి పరీక్ష ఇన్విజిలేటర్లు అయిన ఉపాధ్యాయులే కారణం అంటూ వారిపై నేరం మోపుతూ నిత్యం అరెష్టులు సస్పెన్షన్లు చేయడం చూస్తూ ఉన్నాం.అయితే పరీక్షల నిర్వహణలో చూసి చూడనట్లు వెళ్ళండి.ప్రయివేటు కన్నా దీటుగా మనం ఫలితాలు సాధించాలి అంటూ మౌఖిక ఆదేశాలు అధికారులు నుంచి రావడం ఈ దుస్ధితికి కారణం కాదా?ఏమైనా చేయండి పది ఫలితాలు మాత్రం నూరు శాతం సాధించాలని ప్రభుత్వ అధికారుల ఇచ్చే ఆదేశాలు సహేతుకమా ?మీ బడిలో విద్యార్థి ఫెయిల్‌ అయితే మీదే బాధ్యత అన్న వత్తిళ్ల నుంచే ఈ మాస్‌ ‌కాపీయింగ్‌ ‌జన్మించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చును.పరీక్షల నిర్వహణ సమీక్ష సమావేశంలో పత్రికా ప్రకటనలు మాత్రంపరీక్షల్లో అక్రమ మార్గాలను ఉక్కు పాదంతో అణచి వేస్తాం అని గంభీరంగా అధికారులు ప్రకటించడం ప్రతీ సంవత్సరం మనం వింటున్నదే. కానీ వాస్తవంలో ఏమి జరుగుతుందో మనకు తెలిసిందే. విద్యార్థులలో ప్రతిభా పాఠవాలను పెంచాలంటే మెరుగైన బోధనపై దృష్టి పెట్టాలి. అయితే ఫలితాలే పరమావిధిగా అసాధ్యం అయిన లక్ష్యాలను ఉపాధ్యాయులు ముందు ఉంచినపుడు జరిగే పరిణామాలు ఇలానే ఉంటాయి.ఏం చేస్తారో మాకు తెలియదు మాకు నూరు శాతం ఫలితాలు మా ముందు ఉంచండి అంటే ఇక చేసేది ఏముంటుంది.పరీక్షల ముందు ఏర్పాటు చేసిన సమీక్షల్లో ఫలితాలు రాకపోతే చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు, కలెక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీంతో కొందరు ఉపాధ్యాయులు చేసేది లేక మాస్‌ ‌కాపీయింగ్‌కు సహకరిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ ప్రక్రియకు ఏ మాత్రం సహకరించని ఉపాధ్యాయులు కు మాత్రం ఇన్విజిలేషన్‌ ‌డ్యూటీలు వేయకుండా దూరం పెడుతున్నారు.సహకరించే ఉపాధ్యాయులకు మాత్రం రాచ మర్యాదలు అందిస్తున్నారు.

ప్రతీ సంవత్సరం జరిగే పది పరీక్షలలో కాపీయింగ్‌ ‌పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం అంటూ ప్రతీ రోజు పది మంది లేదా ఇరవై మంది నో డిబార్‌ ‌చేసినట్లు పత్రికల్లో పతాక శీర్షికలలో కనిపిస్తూ ఉండేవి .అయితే నేటి పరిస్ధితి చాలా చిత్రంగా ఉంది.ఎందుకంటే ఇప్పుడు ప్రతీ రోజు 10 మంది ఉపాధ్యాయులను అరెస్ట్ ‌చేశాం 20 మంది ఉపాధ్యాయులను సస్పెండ్‌ ‌చేశాం అనే వార్తలు కనిపిస్తున్నాయి కానీ విద్యార్థుల డిబార్‌ ‌లు అనేవి తెర వెనక్కు వెళ్లి పోయాయి.అంతే కాదు పరీక్షా పత్రాల మూల్యాంకనంలో కూడా సరళంగా వ్యవహరించండి అంటూ మౌఖిక ఆదేశాలు ఇస్తూ ఏదన్నా సమస్య వచ్చినపుడు మాత్రం ఉపాధ్యాయులను బలి పశువులను చేస్తున్నారు.

తరగతి గదుల్లో బోధన, విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారనే అంశాలతో సంబంధం లేకుండా… ఉన్నతాధికారులు ఉత్తీర్ణత విషయంలో లక్ష్యాలు విధించడం వల్లనే ఈ పరిస్ధితి ఏర్పడిందని అధికారులకు తెలియంది కాదు.అయినా ఉపాధ్యాయులు తాము పని చేసే స్కూల్‌ ‌లో ఇన్విజిలేటర్లు గా ఉండరు. అటువంటప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇది ఒక క్విడ్‌ ‌ప్రో కో లాంటి తతంగంగా మారింది మా పిల్లల విషయంలో మీరు సహకరిస్తే మీ పిల్లల విషయంలో మేము సహకరిస్తాం అనే ఒప్పందం మాటున ఇవన్నీ జరుగుతున్నాయి.చూసి రాయడం కూడా రాయలేని పిల్లలకు రాసి పెట్టె తంతు కూడా ఈ పరీక్షల్లో జరుగుతుంది.ఇక కార్పోరేట్‌ ‌విద్యా సంస్ధల యాజమాన్యాలు మాత్రం తమ పిల్లలు పాస్‌ ‌విషయంలో డోకా లేదు. అయితే నూటికి నూరు శాతం మార్కులు సాధనకు మా విద్యా వ్యాపారానికి మా పిల్లలకు మీరు సహకరించండి అంటూ చూపే ప్రలోభాలు కూడా తక్కువేం కాదు.ఈ సందర్భంలో కష్టపడి చదివే విద్యార్థులకు నిరాశ నిస్పృహలు కలుగుతున్నాయి.మరొక విషయం ఏమిటంటే బాగా చదివి పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థి కన్నా చూచిరాతలలో ఘనులైన వాళ్లకు మంచి మార్కులు రావడం అనేది సహజం అయిపోయింది.దీని కారణం బాగా చదివి మంచి ప్రతిభ చూపాలనుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ గందరగోళంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ఎందుకంటే.. పదో తరగతి ఫలితాల ప్రాతిపదికనే ట్రిపుల్‌ ఐటీలలో సీట్లు వస్తాయి. ఇంటర్‌ ‌ప్రవేశాల్లోనూ వీటికి ప్రాధాన్యం ఉంటుంది. తాము ఇంత కష్టపడి చదివినా.. నష్టపోతామేమోనన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.పదోతరగతి విద్యార్థుల్లో ప్రతిభా పాటవాల సంగతి పక్కన పెడితే.. వారిలో చాలా మందికి కనీస ప్రమాణాలు కూడా లేవన్నది జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సర్వేల్లో తేలిన సత్యం.పదో తరగతి విద్యార్థులలో అత్యధికులు ప్రాథమికాంశాలూ చెప్పలేకపోతున్నారని, తప్పులు లేకుండా తెలుగులోనూ రాయలేకపోతున్నారని తమ పేరు తాము రాసుకోవడం కూడా రాని వాళ్ళు ఉన్నారని ఇంటర్‌ ‌లో చేరిన తరువాత కూడికలు కూడా చేయలేక పోతున్నారనేది వాస్తవం.ఈ స్ధితిలో ఇంటర్‌ ‌మధ్యలోనే డ్రాప్‌ ఔట్స్ అయ్యే వాళ్ళు అనేక మంది.పదికి పది పాయింట్స్ ‌వచ్చిన వాళ్ళు అనేక మంది ఇంటర్‌ ‌లో బోర్లాపడుతున్నారు.ఇలాంటి అనేక వాస్తవాలను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(చీ•జు=•) గుర్తించింది.అది చేసిన సర్వేల ప్రకారం విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు ఉండడం లేదు. 3, 5, 8 తరగతులతోపాటు పదో తరగతి విద్యార్థులు బేసిక్స్ ‌చెప్పలేకపోతున్నారు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే పదో తరగతిలో గణితం, సామాన్య శాస్త్రంలో విద్యార్థి సగటు పనితీరు 41% ఉంది. సాంఘిక శాస్త్రం, ఆంగ్లం, తెలుగులో 43%. కానీ, 2019లో పదో తరగతి పరీక్షల్లో మాత్రం ఏకంగా 95% ఉత్తీర్ణులయ్యారు. ఇది ఎలా సాధ్యం? పరీక్షలు నాటికి ఇన్ని అద్భుతాలు ఎలా సాధ్యం అవుతున్నాయి.ఏదో విధంగా గట్టెక్కేశారు అప్పటి వరకూ బాగానే ఉంది. ఇంటర్‌కు వచ్చేసరికి అది దాదాపు 50 శాతంగానే ఫలితాలు ఉంటున్నాయి. కారణం ఇంటర్‌ ‌పరీక్షల్లో ప్రభుత్వం అధ్యాపకుల కు పై తరహా లక్ష్యాలు పెట్టకుండా పద్ధతి ప్రకారం పరీక్షలు జరిపే అవకాశం ఎక్కువ.ఫలితంగా ఇంటర్‌ ‌ఫలితాలు చాలా అల్ప స్ధాయిలో ఉంటున్నాయి.దీనిని బట్టి చూస్తే పదవ తరగతి పరీక్షల్లో అధికులు విషయ పరిజ్ఞానం లేకున్నా ఉత్తీర్ణులు అయిపోతున్న వాస్తవాన్ని మనం అంగీకరించక తప్పదు.ప్రభుత్వ పాఠశాలలో పోటీ పరీక్షలలో వడపోసి ఎంపిక చేసిన ప్రతిభా వంతులైన ఉపాధ్యాయులు ఉన్నారు. అటువంటప్పుడు బోధనలో మెరుగైన ఫలితాలపై దృష్టి పెట్టొచ్చు కదా అంటే క్రమశిక్షణ పాటించి విద్య బోధించే పరిస్ధితులు ప్రభుత్వ పాఠశాలల్లో లేవు విద్యార్ధులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే వీలు లేదు.తల్లి తండ్రులు కూడా ఉపాధ్యాయులకు సహకరించే పరిస్ధితులు లేవు.అందుకు ప్రభుత్వం అనుకూల పరిస్ధితులు కూడా కల్పించడం లేదు.అదే కార్పోరేట్‌ ‌లో అయితే తల్లి తండ్రులు వేలకు వేలు ఫీజులు కట్టి ఏమైనా పరవాలేదు మంచి మార్కులు రావాలని పూర్తి స్వేచ్ఛ ఉపాధ్యాయులకు ఇస్తున్నారు.మరి ఇటువంటి స్వేచ్ఛ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది.

ఇటువంటి పరిస్ధితులలో ఉపాధ్యాయులు బోధించడం కత్తి మీద సాము వంటిది.సంవత్సరం అంతా జరిగే విద్యను ప్రామాణికంగా తీసుకోకుండా కేవలం పది రోజుల్లో నిర్వహించే పరీక్షలను మాత్రమే విద్యార్థి స్ధాయిని నిర్దేశించే విధంగా భావించడం వల్లనే ఈ తరహా అనైతిక పద్ధతులు పరీక్షల్లో వెలుగు చూస్తున్నాయి.కోవిడ్‌ ‌కారణంగా రెండేళ్లు తరువాత నేరుగా జరుగుతున్న ఈ పరీక్షల్లో తమ భవిష్యత్‌ ‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులు ఉన్నారు. ప్రధానంగా కేవలం తమ ప్రతిభతోనే పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులకు మాత్రం ఈ తరహా విధానం ఆశనిపాతంగా తయారయ్యింది.ఏది ఏమైనా ఉత్తీర్ణత ఫలితాల లక్ష్యాలు పక్కన పెట్టి ఉపాధ్యాయులు కు బోధనలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వగలిగితే ఇటువంటి దుష్పరిణామాలు సంభవించవు.ప్రభుత్వం ఒక్క సారి చిత్త శుద్దితో పది పరీక్షలు కఠినంగా జరిపి నట్లయితే..వచ్చిన ఫలితాలు చూస్తే మాత్రం  మూర్ఛ పోవడం మన వంతు అవుతుంది.ఇది వ్యవస్ధీకృత లోపం దానిని పరిష్కరించాలి తప్ప ఆవేశం వచ్చినపుడు సీసీ కెమెరాలు పెడతాం.మొబైల్‌ ‌ఫోన్‌ ‌లు రానివ్వం పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ ‌సెంటర్లు లేకుండా చేస్తాం. కాపీయింగ్‌ ‌కు సహకరిస్తే ఉపాధ్యాయులను అరెస్ట్ ‌చేస్తాం అనేవి శాశ్వత పరిష్కార మార్గాలు మాత్రం కాదని ప్రభుత్వాలు గుర్తించాలి.ఇదే తీరు ముందు కూడా కొనసాగితే నూతన విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్‌ ‌ప్రవేశిస్తున్న వేళ దానిపై కూడా లక్ష్యాలు పెట్టి మొత్తం ఉన్నత విద్యలో కూడా ఇదే ధోరణి కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు.ఈ తీరు ప్రభుత్వ ప్రయివేటు విద్యా సంస్ధల అభ్యసించే విద్యార్థుల మధ్య మరింత అంతరాలను పెంచుతుంది.కాపీయింగ్‌ ‌కు అవకాశం ఉండదు అంటే విద్యార్థులు కష్ట పడి చదువుతారు.తమ సామార్ధ్యాన్ని నిరూపించుకు ంటారు.ఇకనైనా అధికారుల మౌఖిక ఆదేశాలు లక్ష్యాలు పక్కన పెట్టి ఉపాధ్యాయులకు స్వేచ్ఛ ఇచ్చి బోధనపై దృష్టి పెట్టే అవకాశం కలిగిస్తే  మంచి ఫలితాలు సాదించడం పెద్ద కష్టమేమీ కాదు.

rudra raju srinivasa raju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page