క్వాడ్‌ ‌దేశాల పరస్పర విశ్వాసం… ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహం

  • జపాన్‌ ‌వేదికగా క్వాడ్‌ ‌సదస్సులో ప్రధాని మోడీ
  • అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మోడీ భేటీ… ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

టోక్యో, మే 24 : క్వాడ్‌ ‌సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్‌ అనేది మంచి కోసం పుట్టుకొచ్చిన ఒక శక్తి అని, అది ఇండో-పసిఫిక్‌ను మెరుగుపరుస్తుందని అభివర్ణించారు. మంగళవారం టోక్యో వేదికగా క్వాడ్‌ ‌నేతల సమావేశం జరిగింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ‌జపాన్‌ ‌ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ ఈ ‌సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ..క్వాడ్‌ ‌తక్కువ వ్యవధిలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుందని, ఇండో-పసిఫిక్‌లో శాంతిని నిర్దారించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా కొరోనా కష్టకాలంలో సభ్యదేశాల మధ్య..టీకా పంపిణీ, క్లైమేట్‌ ‌యాక్షన్‌, ‌డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌, ఆర్థిక తోడ్పాటుతో పరస్పర సహకారం మరింతగా వృద్ధి చెందిందని మోదీ పేర్కొన్నారు. అంతేకాదు..ప్రమాణం చేసిన కొన్ని గంటలకే క్వాడ్‌ ‌సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. సదస్సుకు ముందు.. బైడెన్‌, ‌కిషిదా, అల్బనీస్‌లతో విడివిడిగా భేటీ అయ్యి ద్వైపాకక్షిక సంబంధాల గురించి ప్రధాని మోదీ చర్చించారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మోడీ భేటీ… ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
టోక్యో వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం నమ్మకమైన భాగస్వామ్యానికి ప్రతీక అని అన్నారు. మోదీ. రెండు దేశాల సంబంధాలను ఈ భూమి వి•ద అత్యంత సన్నిహితమైనవిగా మార్చేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు బైడెన్‌ ‌పేర్కొన్నారు. భారత్‌, అమెరికా బంధం నమ్మకమైన భాగస్వామ్యానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఒకే విధంగా పోలిన ఆలోచనలు, విలువలు బంధాన్ని బలోపేతం చేశాయని అన్నారు. ఇండో పసిఫిక్‌ అం‌శంపై ఇరు దేశాల ఆలోచనా విధానం ఒక్కలాగే ఉందని తెలిపారు. అంతకుముందు క్వాడ్‌ ‌దేశాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

‘వ్యాపార, పెట్టుబడులకు సంబంధించి కూడా ఇరు దేశాల మధ్య బంధం ఇంతకుముందుతో పోలిస్తే మెరుగైంది. కానీ అది ఆశించిన స్థాయికి ఇంకా చేరుకోలేదు. యూఎస్‌ఇన్వెస్ట్మెంట్‌ ఇన్సెంటివ్‌ అ‌గ్రిమెంట్‌తో ఇరు దేశాల మధ్య వ్యాపార పరంగా కూడా బంధం బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాను’ అని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌, అమెరికా కలిసి చాలా సాధించగలవని బైడెన్‌ ‌విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల సంబంధాలను ఈ భూమి వి•ద అత్యంత సన్నిహితమైనవిగా మార్చేందుకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా సమర్థించుకోలేని రీతిలో చేస్తున్న యుద్ధం వల్ల తలెత్తుతున్న పరిణామాల గురించి తాము చర్చించినట్లు బైడెన్‌ ‌వెల్లడించారు. యుద్ధం వల్ల తలెత్తిన వ్యతిరేక ఫలితాలను ఎదుర్కునేందుకు రెండు దేశాలు సంప్రదింపులను కొనసాగిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *