- సీటు ఖాలీ అయ్యాక ఆరు నెలల సమయం
- :సిఇసి రాజీవ్ కుమార్ వెల్లడి
న్యూ దిల్లీ, మార్చి 29 : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉండటంతో వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని సీఈసీ స్పష్టం చేసింది. అయితే కోర్టు తీర్పు తర్వాతే వయనాడ్ స్థానానికి ఉపఎన్నికపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రాహుల్ గాంధీకి కోర్టు ముప్పై రోజులసమయం ఇచ్చిన విషయాన్ని ఈసీ గుర్తు చేసింది. ఒక సీటు ఖాళీ అయిన తర్వాత ఉపఎన్నిక నిర్వహించేందుకు ఆరు నెలల సమయం ఉంటుందని సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు. ట్రయల్ కోర్టు న్యాయపరమైన పరిష్కారానికి 30 రోజుల సమయం ఇచ్చింది.
కాబట్టి మేము వేచి చూస్తాం’ అని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఆప్‌కు జాతీయ స్థాయి పార్టీ హోదా ఇచ్చే అంశం కమిషన్ సక్షలో ఉందని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను బుధవారం ప్రకటించిన సందర్భంగా దేశంలో ఖాళీ అయిన పలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల తేదీని ప్రకటించింది. పంజాబ్‌లోని జలంధర్ పార్లమెంట్ స్ధానం, ఒడిశాలోని ఝర్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గం, ఉత్తరప్రదేశ్‌లోని చ్చంబెయ్ అసెంబ్లీ నియోజకవర్గం, సూర్, మేఘాలయలోని సోహియోంగ్ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించనుంది. ఉపఎన్నికలకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఇచ్చారు. 21వ తేదీన నామినేషన్ల స్కూట్రినీ నిర్వహించనుంగా.. ఉపసంహరణకు 24 వరకు సమయం ఇచ్చారు. మే10న పోలింగ్,మే 13న కౌంటింగ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరగనున్న కర్ణాటక,ఇతర రాష్టాల్ల్రోని ఉపఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.