Take a fresh look at your lifestyle.

కేరళతో సరిహద్దుల్లో నిఘా

  • పది చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు
  • మద్యం, నగదు సరఫరాలపై చెక్‌

బెంగళూరు, ఏప్రిల్‌ 3 : ‌కర్ణాటకలో మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  డబ్బు, ఇతర ఉచితాల ప్రవాహాన్ని నిరోధించడానికి దక్షిణ కన్నడ జిల్లా యంత్రాంగం కేరళతో సరిహద్దు పాయింట్ల వద్ద నిఘాను పెంచింది. కేరళతో అంతర్‌రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద 10 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు డీకే డిప్యూటీ కమిషనర్‌ ఎంఆర్‌ ‌రవికుమార్‌ ‌తెలిపారు. డీకేలో అంతర్‌ ‌జిల్లా, స్థానిక చెక్‌పోస్టులతో కలిపి మొత్తం 27 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. పోలీసు, ఇతర శాఖల సహకారంతో మోడల్‌ ‌కోడ్‌ ఆఫ్‌ ‌కండక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిర్దారించేందుకు జిల్లా నోడల్‌ అధికారిగా డీకే జిల్లా పంచాయతీ సీఈవో కుమార్‌ను ఎన్నికల సంఘం నియమించింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నోడల్‌ అధికారులను ఇప్పటికే నియమించారు. జిల్లా ఎన్నికల కార్యాలయం నుంచి ముందస్తు అనుమతి లేకుండా రాజకీయ పార్టీల టింగ్‌ ‌ల నిర్వహణకు అనుమతించవద్దని మాల్స్, ‌హాళ్లు, ఆడిటోరియంలు, థియేటర్ల యజమానులను డీసీ ఆదేశించారు. మోడల్‌ ‌ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్‌ ‌కులదీప్‌ ‌కుమార్‌ ఆర్‌ ‌జైన్‌ ‌హెచ్చరించారు.

Leave a Reply