పార్లమెంటులో టిఆర్‌ఎస్ డిమాండ్…వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టు
న్యూ దిల్లీ, మార్చి 30 : కులగణన చేపట్టాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో బుధవారం ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. కులగణన చేపట్టాలని ఆయన కోరారు. ఇక రాజ్యసభలోనూ టీఆర్‌ఎస్ ఎంపీ కే కేశవ రావు ఇదే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చారు.
కుల గణన అంశంపై చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి కుల గణన అంశం పెండింగ్‌లో ఉందని ఎంపీ నామా అన్నారు. గతంలో ఈ అంశంపై ప్రభుత్వం హావి• ఇచ్చిందని, దేశ ప్రయోజనం కోసం కుల గణన చేపట్టాలని ఆయన కోరారు. అయితే వాయిదా తీర్మానాలను ఉభయసభల్లోనూ తిరస్కరించారు.