- బిజెపి ప్రభుత్వాన్ని త్వరగా సాగనంపాల్సిందే
- కర్ణాటక కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్
బెంగళూరు, మార్చి 29 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తెలిపారు. మే 10వ తేదీన ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ బుధవారంనాడు ఢిల్లీలో ప్రకటించారు. మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. సీఈసీ ప్రకటనతో ఎన్నికల కోడ్ వెంటనే కర్ణాటకలో అమల్లోకి వచ్చింది. ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తెలిపారు.
ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని తాము కోరుతున్నట్టు చెప్పారు. ఎంత తర్వగా ఈ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తే అంత త్వరగా రాష్టాన్రికి, దేశానికి మంచిదని అన్నారు. అభివృద్ధి ప్రాతిపదికగా, అవినీతి నుంచి రాష్టాన్న్రి దేశాన్ని విముక్తి చేయడానికి ఉద్దేశించిన ఎన్నికలుగా అసెంబ్లీ ఎన్నికలను ఆయన అభివర్ణించారు. అవినీతి పరాకాష్టకు చేరిందని, ప్రధానమంత్రి మోదీ దీనిని ప్రోత్సహిస్తున్నారని, సొంత పార్టీ నేతలపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని డీకే విమర్శించారు.