Take a fresh look at your lifestyle.

కత్తికడితే కేసు పెట్టాల్సిందేనా?

  • ఏటా ఇదే తంతుతో తప్పని ఉత్కంఠ
  • సంక్రాంతికి ముందే సిద్దం అవుతున్న పందెం కోళ్లు

విజయవాడ,జనవరి4 : సంక్రాంతి పండుగ పేరిట నిర్వహించే కోడి పందేలు, ఇతర జూదాలకు చెక్‌ ‌పెట్టేందుకు పోలీస్‌ ‌శౄఖసిద్ధం చేస్తోంది. పందాలతో చెడ్డపేరు తేవద్దని నేతలు పదేపదే హెచ్చరికలు చేస్తున్నారు. పందెం కోళ్లను పెంచే ఫారాలు, వాటికి కత్తులు కట్టే వారిపైనా పోలీసులు నిఘా పెట్టారు. మండల స్థాయి కమిటీలు కోడి పందేలు ఎక్కువగా జరిగే గ్రామాల్లో అవగాహన కల్పించడానికి సమావేశాలు ఏర్పాటు చేయాలని  ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. పందేలకు అనుకూలంగా ఉన్న అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల ద్వారా నిర్వాహకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కేవలం మూడు రోజులు అనుమతులిస్తే కత్తి కట్టకుండా పందేలు నిర్వహిస్తామని ఏటా చెబుతూనే ఉన్నారు.

ముందస్తు చర్యగా పోలీస్‌, ‌రెవెన్యూ, పశుసంవర్థక శాఖ కసరత్తు చేస్తోంది. చట్టాలను అనుసరించి ఏర్పాటైన మండల స్థాయి కమిటీలే కోడి పందేలు జరగక్కుండా చూడాల్సి ఉంది. నిబంధనలు ఉల్లంఘించి కోడి పందేలు నిర్వహించే వారు, వాటిని ప్రోత్సహించే వారిపైనా చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవు తున్నారు. కోడి పందేలకు ప్రసిద్ధి చెందిన ఉభయ గోదావరి జిల్లాలు సహా అన్ని జిల్లాలపైనా దృష్టి కేంద్రీకరించారు. త్వరలోనే అన్ని పోలీస్‌ ‌స్టేషన్ల అధికారులతో సమావేశమై కోడి పందేలపై నిర్ణయం తీసుకునే అవకావం ఉంది.ఫ్రభుత్వ ఆదేశాలను అతిక్రమించి పందేలను నిర్వహిస్తే రౌడీషీట్‌ ఓపెన్‌ ‌చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply