భారత యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్ ఆస్ట్రేలియపై ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదాడు. దాంతో, ఒకే ఏడాది మూడు ఫార్మాట్ల లో వంద కొట్టిన తొమ్మిదో ఆటగాడిగా, నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు. భారత యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్ ఆస్ట్రేలియపై ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదాడు. దాంతో, ఒకే ఏడాది మూడు ఫార్మాట్ల లో వంద కొట్టిన పదోఆటగాడిగా, నాలుగో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే.. మొదటిసారి ఈ ఘనత సాధించింది ఎవరో తెలుసా..? శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే .
ఈ జాబితాలో నలుగురు భారత బ్యాటర్లు ఉన్నారు. ఇప్పటివరకూ ఒకే సంవత్సరం టెస్టులు, వన్డేలు, టీ20ల్లో సెంచరీలు కొట్టిన వాళ్లు ఎవరంటే..? మహేలా జయవర్దనే 2010లో మూడు ఫార్మాట్లలో శతకాలు బాదాడు. భారత మాజీ ఆల్‌రౌండర్ సురేశ్ రైనా కూడా (2010) అదే ఏడాది ఈ ఫీట్ సాధించాడు. శ్రీలంక డాషింగ్ ఓపెనర్, మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్ 2011లో వన్డేలు, టీ20లు, టెస్టుల్లో శతకాలు కొట్టాడు. అహ్మద్ షాదాబ్ (2014లో), తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్ 2016లో), భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (2016లో), టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (2017లో) ఈ ఫీట్ సాధించారు. వీళ్లతో పాటు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (2019లో), పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం (2022లో), శుభ్‌మన్ గిల్ 2023లో ఈ ఘనతకు చేరవయ్యారు.