Take a fresh look at your lifestyle.

ఏ‌ప్రిల్‌, ‌జూన్‌ల మధ్య దేశంలోని చాలా ప్రాంతాలలో ఎక్కువ ఉష్ణోగ్రతలు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 01 : ‌కొన్ని ప్రాంతాలను మినహాయించి భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఏప్రిల్‌ ‌నుండి జూన్‌ ‌వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది. ఈ కాలంలో మధ్య, తూర్పు మరియు వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు ఉండే అవకాశముందని పేర్కొంది. బీహార్‌, ‌జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌మహారాష్ట్ర, గుజరాత్‌, ‌పంజాబ్‌ ‌మరియు హర్యానాలలో వేడిగాలులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఐఎండి డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌మృత్యుంజయ్‌ ‌మహాపాత్ర వర్చువల్‌ ‌విలేఖరుల సమావేశంలో తెలిపారు.

ఏప్రిల్‌లో భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ బ్యూరో తెలిపింది. వాయువ్య, మధ్య మరియు ద్వీపకల్ప ప్రాంతంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుండి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

Leave a Reply