- అత్తింటివారిపై కత్తితో అల్లుడి దాడి
- భార్య, అత్తలు మృతి..మామకు తీవ్రగాయాలు
కర్నూలు, మార్చి 14 : కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. పెల్ళైన రెండు వారాలకే కట్టుకున్న భార్య, అత్త, మామల పై విచక్షణరహితంగా ఓ అల్లుడు కత్తితో దాడి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న శ్రావణ్‌కు రుక్మిణితో రెండు వారాల కిందట వివాహం జరిగింది. అనంతరం ఇరు కుటుంబాల మధ్య చిన్నపాటి మనస్పర్దలు రావడంతో శ్రావణ్ ఆవేశానికి లోనై కర్నూలు పట్టణం సుబ్బలక్ష్మీనగర్‌లో నివాసముంటున్న అత్తింటివారిపై మంగళవారం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య రుక్మిణి, అత్త రమాదేవి చనిపోగా మామ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి సమయంలో అడ్డువచ్చిన మామను సైతం కత్తితో నరకడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన శ్రావణ్.. భార్య, అత్త, మామలపై కత్తితో దాడి చేశాడు. శ్రావణ్‌కు అతడి తండ్రి వెంకటేశ్వర్లు కూడా సహకరించాడు.
ఇద్దరూ కలిసి తీవ్రంగా గాయపరచడంతో కృష్ణవేణి, రమాదేవి అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆయన్ను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కర్నూలు డీఎస్పీ కేవీ మహేశ్, ఇన్‌ఛార్జ్ సీఐ శ్రీనివాసులు, ఎస్సైలు రామయ్య, పెద్దయ్యనాయుడు పరిశీలించారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాలను స్వాధీనపరుచుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.