Take a fresh look at your lifestyle.

ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం

మరోమారు తేల్చి చెప్పన కేంద్రం
న్యూ దిల్లీ, మార్చి 21 : ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం మరోమారు తెగేసి చెప్పింది. హోదా హా లేనట్లేనని..ఇది ముగిసిన అధ్యాయమని.. పార్లమెంటు సాక్షిగా కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. మంగళవారం లోక్‌సభలో వైసీపి ఎంపీలు లావు, బాలశౌరీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోమ్‌ ‌శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఈ ‌మేరకు సమాధానం ఇచ్చారు.14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిందన్నారు. దీంతో ప్రత్యేక, ఇతర రాష్టాల్రకు మధ్య తేడా లేకుండా పోయిందన్నారు. హోదాకు బదులుగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ని ప్రకటించామని, ప్యాకేజీ కింద రూ.15.81 కోట్ల నిధులు విడుదల చేశామని నిత్యానందరాయ్‌ ‌తెలిపారు. గతంలో పలుమార్లు ప్రత్యేక హోదాపై కేంద్రం ఇదే రకమైన సమాధానం ఇచ్చింది. దీంతో ఇప్పుడు హోదా గురించి అధికారంలో ఉన్నవారు పెద్దగా పట్టించుకోవడం లేదు. గతంలో టిడిపి, ఇప్పుడు వైసిపి కూడా దీనిపై ఆశలు చాలించుకున్నారు.

Leave a Reply