Take a fresh look at your lifestyle.

ఏపిలో జగనన్న గోరుముద్దలో రాగిజావ

అమరావతి, మార్చి 21 : విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారణకు రాగిజావా ఇవ్వనున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ‌మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. సత్యసాయి ట్రస్ట్ ‌సహాకారంతో విద్యార్థులకు రాగి జావ అందిస్తున్నామన్నారు. గోరుముద్ద కార్యక్రమాన్ని ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. తాజాగా గోరుముద్దలో రాగి జావ చేరుస్తున్నామన్నారు. ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ రాగి జావా పథకం అందిస్తున్నామన్నారు సీఎం జగన్‌.‌

కొత్తగా ఈ రాగి జావ పథకానికి ఏటా 86 కోట్ల రూపాయల వ్యయం అవుతుందన్నారు సీఎం జగన్‌. ‌రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ ‌పాఠశాలల్లో చదువుతున్న 37,63,698 మంది విద్యార్ధులకు దీని ద్వారా ప్రయోజనం అందనుంది. ప్రతి ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయంతో ఈ రాగి జావ పథకాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.బడి పిల్లల మేథో వికాసానికి అనుకూల వాతావరణంపై స్పెషల్‌ ‌ఫోకస్‌ ‌పెట్టినట్లుగా తెలిపారు. డ్రాపౌట్స్ ‌సంఖ్య తగ్గింపుపై కూడా దృష్టి సారించామన్నారు. గవర్నమెంట్‌ ‌స్కూళ్లను డిజిటలైజేషన్‌ ‌చేస్తున్నామన్నారు. ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్‌లోనూ డిజిటల్‌ ఎడ్యూకేషన్‌ ‌కల్సించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందించానిమని అన్నారు.

Leave a Reply