దఏకగ్రీవ తీర్మానాలు ప్రకటించిన క్షత్రియ రాజపుత్, పెరిక సంఘం, పాస్టర్ల సంక్షేమ సంఘం, వడ్డెర సంఘం
దసకల జనుల సంక్షేమమే బిఆర్‌ఎస్ లక్ష్యం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 30: పటాన్ చెరు నియోజకవర్గాన్ని ప్రగతి పతంలో ముందుకు తీసుకుని వెళ్తున్న బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సబ్బండ వర్గాల ఏకగ్రీవ మద్దతుల పరంపర కొనసాగుతూనే ఉంది. పటాన్ చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన క్షత్రియ రాజ్ పుత్ సమాజ్, పెరిక సంఘం, చర్చి పాస్టర్ల సంక్షేమ సంఘం, వడ్డెర సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే జిఎంఆర్ విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కులం మతం ప్రాంతం తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా పనిచేస్తుందని తెలిపారు.
దళిత బంధు మైనార్టీ బందు బీసీ బందు గృహలక్ష్మి లాంటి వినూత్న సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బిఆర్‌ఎస్ పార్టీ విజయానికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి, అంజి బాబు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వివిధ సంఘాల ప్రతినిధులు రాజన్ సింగ్, కుమార్, సత్తిబాబు, లింగయ్య, ప్రశాంత్, కుల సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.





