వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

April 9, 2019

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ‌శ్వేతామహంతిఈ నెల 9వ తేదీ సాయంత్రం 5గం.లనుండి లోకసభ ఎన్నికల పోలింగ్‌ ‌ముగిసేవరకు ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని జిల్లా కలెక్టర్‌ ‌జిల్లా ఎన్నికల అధికారి శ్వేతామహంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నుండి ఉత్తర్వులు వెలువడ్డాయని ఆ ఉత్తర్వుల ప్రకారం లోకసభ ఎన్నికల ప్రకారం లోకసభ ఎన్నికలపోలింగ్‌ ‌ముగిసే సమయమైన ఈనెల 11వ తేదీ సాయంత్రం 5గం.ల ముందు 48గంటల నుండి ఏలాంటి ప్రచారం చేయకూడదని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైన అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం వారికి 2సంవత్సరాల జైలు శిక్ష, లేదా జరిమానా రెండింటిని కూడా విధించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. 1951 ప్రజా ప్రాతినిత్యం చట్టం సెక్షన్‌ 126 ‌ప్రకారం నాగర్‌కర్నూల్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలో పోలింగ్‌ ‌ముగిసే 48గంటల ముందు నుండి ఏవ్యక్తి కానీ, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలు, ఊరేగింపు దారులు ప్రత్యేకించి ప్రచార కార్యకర్తలు అలాగే ప్రచారం నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు నాగర్‌••ర్నూల్‌ ‌పార్లమెంటు నియోజకవర్గంలో ఓటర్లు కాని వారు ఎలాంటి ప్రచారం నిర్వహించవద్దని అంతేకాక ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటలనుండి అనగా ప్రచార సమయం ముగిసిన తరువాత బయటి వ్యక్తులు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని ఆమె కోరారు. ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకొని రాజకీయపార్టీలు వారి ప్రతినిధులు పోటీలోవున్న అభ్యర్థులు నియోజకవర్గంలో స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో లోకసభ ఎన్నికల నిర్వహించేందుకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం లోకసభ ఎన్నికల దృష్ట్యా 10,11 వతేదీన సాదారణ సెలవు దినంగా ప్రకటించనట్లు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రటనలో తెలిపారు.