ఎన్ని‘కల’లు!
వరసలు కలిపేస్తారు
వాగ్దానాలు గుపిస్తారు
వైకుంఠం చూపిస్తారు
ప్రేమలో తడిపేస్తారు
కళ్ళబోల్లి కబురులు చెప్పేస్తారు
కపట ప్రేమ లో పడేస్తారు
కానుకలు అంటూ కుదిపేస్తారు
నిషాను నింపేస్తారు
నోట్లు ఎరేస్తారు
గుడ్డి గుర్రం ఎక్కిస్తారు
ఆశల ఇంద్రధనసు చూపిస్తారు
సునాయాసంగా గద్దే ఎక్కేస్తారు
ఆపై చుక్కలు చూపిస్తారు
-గాదిరాజు రంగరాజు
8790122275