ఎండాకాలం ఇలా ఎదుర్కోవాలి

ఒకప్పుడు మండే ఎండలూ అంటే 35 డిగ్రీలు దాటాలి. అదీ మే నెలలో ఉండేవి కానీ, ఇప్పుడు మరింత ముందుగానే వేసవి మొదలవుతోంది. మార్చినుంచే భానుడు మరీ మండిపడుతున్నాడు. 40-48 వరకూ డిగ్రీల వేడి మామూలై పోయింది. మన జీవన విధానమూ మారే ప్రకృతికి అనుగుణంగా మారక పోతే ప్రణాలకే ప్రమాదం రావొచ్చు. వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ద ఉంచండి.

సంక్రాంతులు, శివరాత్రులు, భీష్మ ఏకాదశులు, పూర్తయ్యాయి. ఈ సారి ఉభయరాష్ట్రాల్లో పిల్లల పరీక్షలు, ఉగాదులు మిగిలి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు. ఇక అసలు ఆరోగ్య పరీక్షలు మొదలవుతున్నాయి. ఎండాకాలం, మండేకాలం వచ్చిపడింది. మార్చ్ ‌నెల మొదటి నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెట్టడం మొదలు పెట్టాడు. మార్చి నెలాఖరు రోజుల్లో ఎండలు మరింత ముదురుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండాకాలంలో అనేక రుగ్మతలు మొదలవుతాయి. పిల్లలు, వృద్ధులు, స్త్రీలు అతిజాగ్రత్త వహించాల్సిన కాలం. ఎండలకు ఉష్ణోగ్రతలు పెరిగి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎండాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొలాజెన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోండి. మధ్యమధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. దీనివల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది.

ఇల్లు దాటకుండా ఉంటే కనీసం 2 లీటర్లు, బయటకు వెళ్ళేవాళ్ళు మరో లీటరు అదనంగా మంచినీళ్లు తాగాలి. అలసటగా ఉందని అనిపిస్తే తాజా పళ్ళరసాలు తీసుకోవాలి. ఎండకాలం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగు, సన్‌ ‌స్క్రీన్‌ ‌లోషన్స్, ‌క్యాప్‌..‌వదులైన దుస్తులు ధరించాలి. తేలికైన వదులుగా ఉన్న లేత రంగుల వస్త్రాలు ధరించాలి. ఆల్కాహాల్‌, ‌కాఫీ, టీల వంటివి డీహైడ్రేషన్‌ ‌కలిగిస్తాయి కనుక వేసవిలో వాటికి దూరంగా ఉండాలి. ఎండలో ఎక్కువ శ్రమతో కూడిన పనులు నివారించ గలిగితే మంచిది. అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకోవడం శ్రేయస్కరం. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వేసవిలో దాహార్తిని తీర్చే చల్లటి నీరు, నిమ్మరసం, కొబ్బరి బొండాలతో పాటు మజ్జిగ తీసుకోవడం ఎంతో మేలు. అలాగే కీరదోస, క్యారట్‌, ‌బీట్‌రూట్‌ ‌లాంటి పచ్చి కూరగాయలను కూడా తినవచ్చు.

రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం నీరు కలిసిన మాయిశ్చరైజింగ్‌ ‌క్రీము రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్‌ ‌వాటర్‌ను రాసుకుంటే మంచిది. చర్మం బాగా పొడిబారి పోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోవద్దు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలు సేవించడం ఉత్తమం. వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లయినా శుభ్రం చేసుకోవాలి.. వేసవిలో రెండు పూటల స్నానం చేయడం మంచిది.

ఒకప్పుడు మండే ఎండలూ అంటే 35 డిగ్రీలు దాటాలి. అదీ మే నెలలో ఉండేవి కానీ, ఇప్పుడు మరింత ముందుగానే వేసవి మొదలవుతోంది. మార్చినుంచే భానుడు మరీ మండిపడుతున్నాడు. 40-48 వరకూ డిగ్రీల వేడి మామూలై పోయింది. మన జీవన విధానమూ మారే ప్రకృతికి అనుగుణంగా మారక పోతే ప్రణాలకే ప్రమాదం రావొచ్చు. వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ద ఉంచండి.

ఎండాకాలం ఎవరైనా జాగ్రత్తగానే వుండాలి. పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత, కలుషిత నీరు, ఆహారం వలన వేడి అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల పిల్లలు ఈ కాలంలో జబ్బుపడుతూ వుంటారు. అలా కాకుండా వేసవి ఆనందంగా గడపాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎండాకాలం పిల్లల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ముందు చూడాలి. ఉష్ణోగ్రత పెరిగితే బయట వాతావరణం చాలా వేడిగా వుంటే పిల్లల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాన్ని నియంత్రించే కేంద్రం పిల్లల మెదడులో చాలా బలహీనంగా వుటుంది. అందుకని వడదెబ్బ తగిలే అవకాశం వారిలో ఎక్కువ. పిల్లల చర్మం వైశాల్యం ఎక్కువగా వుండటం వల్ల వారి వంట్లో నీరు వేగంగా ఆవిరై పోవచ్చు. అలా కూడా వారికి వడదెబ్బ తగలవచ్చు. తలనొప్పి కూడా రావచ్చు. ముఖ్యంగా ఆరేళ్ళ లోపు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి ఫిట్స్ ‌వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఎండలో ఎక్కువ సేపు గడపాల్సి వస్తే మాత్రం ఈ జాగ్రత్తలని పాటించండి. ఎక్కువగా చెమట పట్టే వాళ్లు రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు తేమ కలిగిన సబ్బులకు బదులు వేప ఔషధాలు కలిగిన సబ్బులను ఉపయోగిస్తే చెమట దుర్వాసన మాయం చేయవచ్చు. ఎండాకాలంలో సింథటిక్‌ ‌వస్త్రాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. నూలు దుస్తులను ధరించడం శ్రేయస్కరం. నూనె పదార్థాలు, వేపుళ్లు, కారం, మసాలాలను వీలైనంత వరకు తగ్గించాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీలైనంత వరకు మాంసాహారాన్ని తీసుకోకపోవడం మంచిది. పీచు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆలివ్‌ ఆయిల్‌ ఆరోగ్యానికి మంచిది. అంతేగాకా చాలా సులభంగా జీర్ణమవుతుంది. అందువల్ల ఈ కాలం వంటకాల్లో ఆలివ్‌ ఆయిల్‌ ఉపయోగించడం మంచిది.  చర్మంపై పేరుకుపోయిన వ్యర్థాల వల్ల చెమట పొక్కులు రావచ్చు. ఆ పొక్కులు ఇన్‌ఫెక్షన్‌తో సెగగడ్డలుగా మారవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆ చీము నెత్తురు గడ్డల వల్ల నొప్పి, జ్వరం తీవ్రతరం కావచ్చు. ఒకోసారి ముక్కు నుంచి రక్తం కారవచ్చు (ఎపిస్టాక్సిస్‌).
‌నీరు ఆహారం కలుషితమైతే… కలరా, టైఫాయిడ్‌, ‌కామెర్ల వంటి వ్యాధులు వ్యాపించవచ్చు. ఎండాకాలం కళ్ళ కలక వేగంగా వ్యాపిస్తుంది. దుమ్మూధూళి వల్ల, వేడి వల్ల కంటి ఇన్‌ఫెక్షన్‌ ‌త్వరగా పాకిపోతుంది. ఒకోసారి చూపు మందగించి, రెటినాపై కూడా ప్రభావం చూపవచ్చు. చర్మంపై పేరుకుపోయిన వ్యర్థాల వల్ల చెమట పొక్కులు రావచ్చు. ఆ పొక్కులు ఇన్‌ఫెక్షన్‌తో సెగగడ్డలుగా మారవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆ చీము నెత్తురు గడ్డల వల్ల నొప్పి, జ్వరం తీవ్రతరం కావచ్చు. ఒకోసారి ముక్కు నుంచి రక్తం కారవచ్చు (ఎపిస్టాక్సిస్‌). ‌నీరు ఆహారం కలుషితమైతే… కలరా, టైఫాయిడ్‌, ‌కామెర్ల వంటి వ్యాధులు వ్యాపించవచ్చు. ఎండాకాలం కళ్ళ కలక వేగంగా వ్యాపిస్తుంది. దుమ్మూధూళి వల్ల, వేడి వల్ల కంటి ఇన్‌ఫెక్షన్‌ ‌త్వరగా పాకిపోతుంది. ఒకోసారి చూపు మందగించి, రెటినాపై కూడా ప్రభావం చూపవచ్చు.
చలి తగ్గి ఎండలు ముదరక ముందే గవద బిళ్ళలు, పొంగు, హైపటైటిస్‌ ‘ఎ’ ‌కూడా ఎండాకాలం వ్యాపిస్తాయి. వీటినన్నింటినీ టీకాలతో నిరోధించవచ్చు. గతంలో మనం తెలుసుకున్న టీకాల వల్ల వీటిని నివారించవచ్చు. ఆటలమ్మ (చికెన్‌ ‌ఫాక్స్) ‌టీకా ఒకటిన్నర సంవత్సరాలు నిండిన పిల్లలకి తప్పకుండా ఇవ్వాలి. 4 – 6 సంవత్సరాలకి రెండవ మోతాదు ఇవ్వాలి.
– నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page