కాంగ్రెస్ పార్టీ నైజం బయటపడింది
రేవత్ వ్యాఖ్యలపై• మండిపడ్డ కెటిఆర్ సహా బిఆర్‌ఎస్ మంత్రులు
జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యుత్ ఇవ్వకుండా గతంలో రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయట పెట్టుకుందని అన్నారు. తానా సభలో కరెంట్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ మండిపడింది. ఇది కేవలం ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసే ఎత్తుగడ మాత్రమేనని విమర్శించింది. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ విధానంగానే చూస్తామని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు దహనం చేయాలని సూచించింది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ…కాంగ్రెస్ నిర్ణయాన్ని తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సరిపడా సాగునీరు, ఉచిత విద్యుత్, పంటపెట్టుబడి వంటి పథకాల అమలుతో తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
గతంలో వ్యవసాయం దండుగ అని చంద్రబాబు అన్నాడని, ఆయన వారసత్వాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ నేతలు శత్రువులని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీలో ఉన్న శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి వి•డియాతో మాట్లాడారు. చంద్రబాబు వెళ్లిపోయినా ఆయన నీడలు, జాడలు తెలంగాణలో మిగిలే ఉన్నాయని రేవంత్ వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. 2004 పరిస్థితులను 20 ఏండ్ల తర్వాత గుర్తుకు తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని చెప్పారు. రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్‌పై మాట్లాడిన మాటలు రైతులపై పిడుగుపాటు లాంటివేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతాంగానికి అన్ని బాధల నుంచి శాశ్వత విముక్తి లభిస్తున్న తరుణంలో రేవంత్ రూపంలో కొత్త బాధవొచ్చిపడిందన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఏమిటో ఆయన వ్యాఖ్యలతో బయట పడిందని చెప్పారు. గతంలో ఆ పార్టీ రైతులకు ఏడు గంటల కూడా కరెంటు ఇవ్వలేక పోయిందని విమర్శించారు. అసలు పీసీసీ చీఫ్‌కు వ్యవసాయంపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ఎకరా పారాలంటే గంట విద్యుత్ చాలట అని ఎద్దేవాచేశారు. ఇక కాంగ్రెస్ జెండా పట్టుకున్న రైతులు ఆలోచించుకోవాలని సూచించారు. గతంలో కాంగ్రెస్ ఆరు గంటలు కరెంటు ఇస్తే రేవంత్ తదితర టీడీపీ నేతలే ధర్నాలు చేశారని గుర్తుచేశారు.
వి• ఇంట్లో 24 గంటలు కరెంటు ఎందుకు ఉండాలి.. రైతులకు మాత్రం 24 గంటలు ఇవ్వోద్దా అని ప్రశ్నించారు. రైతులంటే కాంగ్రెస్‌కు ఇంత చిన్న చూపా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్టుబడి దారులకు 24 గంటల కరెంట్ ఉండాలి.. రైతులకు ఎందుకు ఉండకూడదని నిలదీశారు. ఎప్పుడంటే అపుడు కరంటే ఆన్ చేసుకునే వెసలుబాటు రైతులకు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలు సరఫరా చేయాలని నిర్ణయించారని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్‌కు వోటేస్తే రైతులకు పాము, తేలు కాట్లే గతన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతం కాదని, ఆయన పీసీసీ అధ్యక్షుడిగా మాట్లాడారు కాబట్టి కాంగ్రెస్ తప్పించుకునే అవకాశం లేదని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. మూడు గంటల ఉచిత కరెంటు సరిపోతుందని అవగాహన లేనివాళ్లే మాట్లాడతారన్నారు. కాంగ్రెస్ తీరుపై రేపు రైతులతోపాటు బీఆర్‌ఎస్ శ్రేణులు ఉద్యమిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీది రద్దుల బతుకని..ఉచిత విద్యుత్‌ను రద్దుచేస్తామని రేవంత్ అంటే, యాదాద్రి ప్లాంటును క్యాన్సల్ చేస్తామని ఎంపీ కోమటి రెడ్డి అంటున్నాడని విమర్శించారు. రద్దుల కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పుడో రద్దు చేశారని ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ నేతలు ఏ పార్టీతో టచ్‌లో లేరని, ప్రజలంతా కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఇక రేవంత్ చేసిన వ్యాఖ్యలను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని రేవంత్ రెడ్డికి ఎంత కండ్ల మంట ఉందో అర్థమవుతుందన్నారు. సిఎం కెసిఆర్ రైతులకు కొండంత అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టగొట్టేందుకు చూస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్, టిడిపి పాలనలో కరెంట్ లేక రైతులు అరిగోస పడ్డారని, స్వరాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన నిరంతర కరెంట్ సరఫరాతో ఆర్థికంగా ఎదుగుతున్న రైతులను మళ్ళీ చీకట్లోకి నెట్టేసే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు. మొదటి నుంచి కాంగ్రెస్‌కు రైతులంటే చిన్నచూపని, మొన్న ధరణి వొద్దన్నారని, ఇప్పుడు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ? కాంగ్రెస్ రైతు వ్యతిరేఖ పార్టీ అని అర్ధమవుతుందని వ్యాఖ్యనించారు. రేవంత్ రెడ్డి రేపు రైతుబంధు, రైతు బీమా కూడా వద్దంటారని ద్వజమెత్తారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పి బంగాళఖాతంలో కలపాలని తెలంగాణ రైతాంగానికి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం నిరసనలు చేపట్టాలని మంత్రి అల్లోల పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా మంగళవారం, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం, ప్రజలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. రేవంత్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాష్ నిప్పులు చెరిగారు.
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డివి అజ్ఞానపు మాటలు అని ధ్వజమెత్తారు. అమెరికా పర్యటన సందర్భంగా ఉచితాల గురించి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ధరణి ఎత్తేస్తామని కొద్ది రోజుల క్రితం అన్నాడు.. దాంతో రాష్ట్ర రైతులు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు అజ్ఞానంతో రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందన్నాడు. కానీ 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ రైతులు ఎదిగారని ప్రకాశ్ తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులతో ఇవాళ దేశంలోనే అత్యధిక వరి పంట పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ప్రకాశ్ గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు ఉచిత విద్యుత్ అవసరం లేదని అపరిపక్వ మాటలు మాట్లాడం కరెక్ట్ కాదు. రేపు రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధును కూడా వద్దంటాడు ఈ రేవంత్ అని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని వీ ప్రకాశ్ డిమాండ్ చేశారు.


