పంచాంగాలన్ని సంవత్సరాదుల్ని నిర్దేశిస్తాయి. ఆ సంవత్సరాల పేర్లు ఆర్య భాషలో ఉన్నాయి. ఆ భాష నిన్నమొన్నటి దాకా బ్రాహ్మణుల సోత్తైన సంస్కృతం. ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి ఒక్క మన భారతదేశంలోనే నెలల్లో, తేదీలలో సైతం తేడా ఉంది. వాళ్ల పంచాంగాల అన్నిటికీ మూల గ్రహ, నక్షత్ర, రాసు లేనని వారంటారు. అయితే వేర్వేరు రాష్ట్రాలకు వేరు వేరు కాలాల్లో సంవత్సరాలు లేల సంభవం? పంచాంగాలు ఏ రాష్ట్రంలోనూ, ఏ దేశంలోనూ ముంచుకొస్తున్న తుఫానులను గాని, ఎన్నడు హెచ్చరించినట్లు గాని, ఆ హెచ్చరికలను అనుసరించి అవి జరిగినట్లు కానీ చరిత్రలో జాడ లేదు. అయినా తమ కడుపులు నింపుకోవడం కోసం ఈ పంచాంగ కీర్తనలు.
ఆ కాయ పోకాయ కబుర్లతో వాననీ ,ఎండనీ, పంటల్ని గురించి జోస్యాలు గుప్పిస్తారు. వ్యక్తులకు, రాష్ట్రాలకు, దేశానికి శుభాశుభ సందేశాలు అందజేస్తారు. వారు చెప్పేది ఎన్నడు జరగదు. మనకు మూఢనమ్మకాలలో కొట్టుకుపోయే రాజకీయ నాయకులు బయలుదేరారు. వారు రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వాలను కూడా చేపడుతున్నారు. ఇక మంత్రులు, ఇతర రాజకీయ నాయకులు వేరు వేరు కూటాలుగా ఏర్పడి పంచాంగాలు చెప్పించు కుంటారు. ఎవరి కూటానికి అనుకూలంగా చెప్పించు కుంటారు. ఎవరి కూటానికి అనుకూలంగా పంచాంగం ఫలితాలు చెప్పడం కడుపు కక్కుర్తి పండితుల ఆనవాయితీ, వారు చెప్పే వాటిలో ఒక్కటి నిజం ఉండదు. వానాకాలం వాన కురుస్తుందని, ఎండాకాలం ఎండలు ఉంటాయని చలికాలం చలి ఉంటుందని ఏ చిన్న బడి పిల్లవాణ్ణి అడిగినా చెబుతాడు. ప్రతిరోజు పొద్దు పొడుస్తోందని, కూకుతుందని , కాకులు, గ్రద్దలు కూడా గ్రహిస్తాయి. ఇక పంచాంగకర్తలు చెప్పేవన్నీ అభూత కల్పనలే. వారు చెప్పినట్లు ఏది జరగదు. ఇండియా నుండి పాకిస్తాన్ ఫీలవుతుందని, మరల పాక్ రెండు ముక్కలవుతుందని, మద్రాసు నుండి ఆంధ్ర వెళుతుందని, తర్వాత తెలంగాణలో కలుస్తుందని, మరల దానినుంచి చీలి ఆంధ్ర ప్రదేశ్ మధ్యలో అమరావతిలో రాజధాని నగరం నిర్మిస్తుందని ఏనాడైనా ఏ పంచాంగకర్త అయినా చెప్పాడా?.
ఇలాంటివి గ్రహగతులకు సంబంధించినవి కావంటారేమో పంచాంగ కర్తలు. అసలు గ్రహాలు ఎన్నో అవి ఏమిటో ఈ పంచాంగకర్త లకు తెలుసా? భూమి గుండ్రంగా గుండ్రంగా ఉంటుందని, సూర్య చంద్రులు గ్రహాలు కావని, ఇతర గ్రహాల తో పాటు భూగ్రహం కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతుందని, అసలు గ్రహాలు ఎన్నో వారికి తెలియవని, వారి ఊహల్లోని రాహు కేతువులనే గ్రహాలు లేనే లేవని, నక్షత్రాలు కోటానుకోట్లు ఇప్పటికీ మన దుర్బినులకు అందేవి కాక మరెన్నో ఉన్నవని ఏ పంచాంగకర్త కు ఊహాలోకయునా రాదు. ఎందుకంటే వారికి తిండి ప్రధానం. ఏ మోసం వల్ల అది దొరుకుతుంది అంటే, వారు ఆ మోసానికి తలపడతారు. ఇది వారి తాత ముత్తాతల పరంపర నాటి వారసత్వం. ఆ వారసత్వం ప్రకారం వారు అందరి జాతకాలు వ్రాస్తారు కానీ వారి జాతకం మాత్రం ఇలా మోస వృత్తిలో జీవించడమే. అది వారసత్వమే హిందువుల్లో బ్రాహ్మణ మతం చలవ వల్ల అది ఇప్పటికీ మారుమూల లో సైతం రాజ్యం చేస్తున్నది. ఎందుకంటే అది మతంతో గూడుకట్టుకుంది కాబట్టి.
సి. రామరాజు, జన విజ్ఞానవేదిక,
తెలంగాణ,9441967100.