రషారష్య్యా, ఉక్రెయిన్ యుద్ధం అంతులేని దుఃఖాన్ని మిగల్చడంతో పాటు ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న 20 వేల మంది భారత మెడికోల భవిష్యత్తును అగమ్యగోచరం చేసింది. ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులకు మన దేశం లోని మెడికల్ కళాశాలల్లో డిగ్రీ పూర్తి చేయడానికి అదనపు సీట్లు, సెమిస్టర్ పరీక్షల్లో అవకాశం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసియార్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడాన్ని ఆహ్వానిస్తునే కొన్ని సూచనలు గమనం లోకి తీసుకోవాలసిన అవసరముంది.
తెలంగాణ నుండి ఉక్రెయిన్ మెడికోలు 700 మంది పైగా ఉన్నారని, వారి ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, సానుకూలంగా స్పందిచాలని ముఖ్యమంత్రి అన్నప్పటికి అది దేశం మొత్తంలోని 20 వేల విద్యార్ధులకు వర్తించవలసిన, నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకత్వంలో కొనసాగవలసిన ప్రక్రియ.ఫీజులు భరించే దాతృత్వం మనకు ఉన్నప్పటికి, సాంకేతికంగా అనేక అడ్డంకులు తొలగడానికి రాష్ట్రంలో, దేశంలో నిపుణులు కమిటీ వేయవలసి ఉన్నది. ఉక్రెయిన్ మెడికోలు అడ్మిషన్ తీసుకున్న మెడికల్ కాలేజీ నుండే మెడికల్ డిగ్రీ పొందవలసి ఉన్నది.
మన దేశంలో హౌజ్ సర్జన్ కలుపుకొని ఐదున్నర సంవత్సరాలలో ఇచ్చే యం.బి.బి.యస్ డిగ్రీకి బదులు ఉక్రెయిన్ లో 6 సంవత్సరాలు చదివిన తరువాత యం.డి డిగ్రీ ఇస్తారు. మన దేశంలో పోస్టుగ్రాడ్యువేషన్‌కు మాత్రమే యం.డి డిగ్రీ ఇస్తారు. అంతర్జాతీయంగా ఉక్రెయిన్ వైద్య విద్యపై పెద్దగా అపప్రద, నాణ్యతా లేమి అభియోగాలు లేనప్పటికి, ఈ మధ్య అక్కడ అనేక వైద్య కళాశాలలు ఇక్కడి ప్రైవేట్ వైద్యవిద్య యాజమాన్యాలతో జతకట్టి అడ్డగోలుగా మెడికల్ డిగ్రీలు ఇచ్చింది వాస్తవం. నీట్ పరీక్షలో నెగ్గి ఫీజులు కట్టలేక వేల మంది వచ్చిన యం.బి.బి.యస్ సీటును కూడా వదులుకునే పరిస్థితి మన దేశంలో ఉన్నది. ఎక్కువ మంది డాక్టర్ల అవసరం ఉన్నదనే చర్చతో పాటు అనేక సంక్లిష్ట అంశాల రీత్యా వేల మంది ఉక్రెయిన్ కు వెళ్ళి యం.డి డిగ్రీలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి వృత్తి, ఉద్యోగ అవకాశాల కల్పించక తీవ్ర సంక్షోభం ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల నియమకాలు చేపట్టకుండా, ప్రైవేట్ వైద్యంలోనయినా చేయూత ఇవ్వకుండా డిగ్రీలు చేతికి ఇచ్చి తీవ్ర నిరాశకు గురి చేస్తున్నారు.
ఉక్రెయిన్లో చదువుతూ యుద్దం వలన మన దేశానికి వచ్చిన వైద్య విద్యార్ధుల కళాశాలల యాజమాన్యంతో, అక్కడి మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపి, వివరాలు సేకరించకుండా, అదనపు సీట్లు కేటాయిస్తామనడం, లక్షల్లో ఖర్చులు భరిస్తామనడం తొందరపాటుగా ఉంది. దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో ఉక్రెయిన్ తరహా ఫీజులతో మిగిలిన సెమిస్టర్స్, క్లినికల్స్ పూర్తి చేసుకోవడానికి అవకాశమిచ్చి భారత వైద్య విద్య నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించి ప్రత్యేక పరిస్థితుల్లో అవార్డ్ చేయబడిన మెడికల్ డిగ్రీగా స్పష్టంగా పేర్కొనాలి. ఇప్పటికే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొత్త మార్గదర్శకాల్లో కార్పొరేట్ మెంబర్స్ ఆధిపత్యంతో కొత్తపుంతలు తొక్కుతున్న వ్యవస్థలు ప్రధానికి కేసియార్ రాసిన లేఖతో సానుకూలంగా స్పందించాలి తెలంగాణలో స్వతంత్రంగా ఉక్రెయిన్ మెడికోల కోసం సహకరిద్దామన్నా కూడా వైద్య విద్యా నిపుణుల కమిటీ, అన్ని పార్టీల మద్దతు అవసరమని గుర్తించాలి.