సామాజిక పరిణామాలతో.. 19 జూలై 2021న స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్) చేశారు. గురుకుల కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు.
ఐరన్ లేడీ ఆశీర్వాదం…
అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరాలని నిర్ణయించుకున్నారు. 8 ఆగస్టు 2021న రాష్ట్రంలో ‘‘దళితులు, బహుజనులు రాజకీయ అధికారం సాధించేందుకు కృషి చేసే సమయం ఆసన్నమైందని’’ పిలుపుతో 8 ఆగస్టు 2021లో ఉద్యమాల ఖిల్లా.. నల్గొండ జిల్లా ఎన్జీ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో బీఎస్పీలో ప్రవీణ్ కుమార్ చేరారు. ఆర్‌ఎస్పీని పార్టీలోకి దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్ కండువాతో స్వాగతించారు. వెంటనే కొన్ని రోజులకు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలోనే బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి రోజున ఖిల్లా వరంగల్ నుంచి బహుజన రాజ్యాధికార యాత్ర ప్రారంభించారు. యాత్రలో రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతానికెళ్లి పేదలు, విద్యార్థులు, ప్రతి సామాజిక వర్గాన్ని కలుస్తూ వారి కష్టసుఖాలు, ఇబ్బందులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బహుజన నినాదంతో యాత్ర చేస్తున్న సందర్భంలో మాతృమూర్తి ప్రేమమ్మ తన పింఛను డబ్బులిచ్చి గొప్పతల్లి మనసు చాటారు. ఓ పల్లెలో ఓ కుర్రాడు రూ.10 అందించి ఔరా అనిపించి ఆర్‌ఎస్పీ మన్నలు పొందాడు. ఇక ఆనతి కాలంలోనే పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్‌ఎస్పీకి.. మాన్యవర్ కాన్షీరాం వారసురాలు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి బాధ్యతలు అప్పగిస్తూ దీవించింది. 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో.. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన బీసీకి చెందిన వ్యక్తికి టికెటిచ్చి బహుజన చాటారు.
(నేడు నవంబర్ 23న డాక్టర్.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సర్ జన్మదిన శుభాకాంక్షలతో..)
-తలారి గణేష్
సామాజిక కార్యకర్త
9948026058