Take a fresh look at your lifestyle.

ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ అవార్డు

న్యూ దిల్లీ, మార్చి 14 : ఆస్కార్స్ 2023‌లో ఇండియన్‌ ‌ఫిల్మస్‌కు రెండు అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ ‌ఫిల్మ్‌లోని నాటు నాటు సాంగ్‌ ‌ద ఎలిఫెంట్‌ ‌విస్పరర్స్ ‌షార్ట్ ‌ఫిల్మ్‌కు ఆస్కార్లు దక్కాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభ చిత్రబృందాన్ని అభినిందించింది. ఇండియన్‌ ‌సినిమాకు ఆస్కార్‌ అవార్డులు దక్కడం అది మన వైభవాన్ని చాటుతుందని చైర్మెన్‌ ‌జగదీప్‌ ‌ధన్‌కర్‌ ‌తెలిపారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఇది ఒక కొత్త గుర్తింపుని ఇచ్చిందన్నారు.

ప్రపంచ దేశాల నుంచి మన సినిమాలపై ప్రశంసలు అందుతున్నట్లు ఆయన వెల్లడించారు. అవార్డులు గెలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌, ‌ద ఎలిఫెంట్‌ ‌విష్పరర్స్ ‌చిత్ర బృందాలకు సభ తరపున కంగ్రాట్స్ ‌చెబుతున్నట్లు చైర్మెన్‌ ‌జగదీప్‌ ‌పేర్కొన్నారు. రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ ఎం‌పీ కే కేశవరావు ఒరిజినల్‌ ‌సాంగ్‌ ‌కేటగిరీలో మన పాటకు అవార్డు వచ్చినట్లు గుర్తు చేశారు. ఆ చిత్రానికి కథ రాసిన ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌కు కూడా ఆయన అభినందనలు చెప్పారు. డైరక్టర్‌ ‌రాజమౌళి కూడా తమ రాష్టాన్రికే చెందినవారేనన్నారు. రెండు చిత్రాలకు ఆస్కార్లు రావడం ఇండియన్‌ ‌సినిమాకు దక్కిన గుర్తింపు అని ఎంపీ కేశవరావు తెలిపారు.

Leave a Reply