- పాక్ నుంచి ఆయుధాల సరఫరా
- నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు
న్యూ దిల్లీ, మే 5 : భారత్‌పై ఎప్పుడూ విషం చిమ్ముతుండే పాకిస్థాన్ తలపెట్టిన మరో భారీ కుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేశారు. గురువారం ఉదయం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను కర్నాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున బుల్లెట్లు, గన్‌పౌడర్ కంటైనర్‌లను స్వాధీనం చేసుకున్నారు. మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే అసలు బాగోతం బయటపడింది. తెలంగాణలోని ఆదిలాబాద్ కేంద్రంగా పాకిస్థాన్ పన్నిన భారీ ఉగ్ర కుట్రగా హర్యానా పోలీసులుగుర్తించారు. పాకిస్థాన్ నుంచి పెద్ద ఎత్తున బుల్లెట్లు, మందుగుండు సామగ్రిని అందుకుని ఆదిలాబాద్‌కు తరలిస్తున్న నలుగురు ఉగ్రవాద అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, మణిపుర్‌లో గురువారం తెల్లవారుజామున బాంబు పేలుడు కలకలం సృష్టించింది.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నారు. పాక్ ఉగ్రవాదులు చెప్పిన విధంగా నిందితులు తెలంగాణలోని ఆదిలాబాద్‌కు మందుగుండు సామగ్రిని తరలిస్తున్నారు. నిందితులను గుర్‌ప్రీత్, అమన్‌దీప్, పర్మిందర్, భూపిందర్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు గుర్‌ప్రీత్‌కు ఫిరోజ్‌పుర్ జిల్లాలో డ్రోన్ ద్వారా పేలుడు పదార్థాలు అందాయి. వీరు నాందేడ్‌కు పేలుడు పదార్థాలను తరలించే సమయంలో పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయమైన వర్గాల సమాచారం మేరకు పోలీసులు వారిని బస్తారా టోల్ ప్లాజా సవి•పంలో చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
వారిలో ముగ్గరు ఫిరోజ్‌పుర్‌కు, మరొకరు లుథియానాకు చెందినవారని తెలిపారు. ఒక పిస్టల్, 31 లైవ్ క్యాట్రిడ్జ్‌లు, పేలుడు పదార్థాలతో కూడిన మూడు కంటైనర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు.ఈ ఘటనపై హర్యానా సీఎం స్పందించారు. నిందితులు హరియాణా వి•దుగా పేలుడు పదార్థాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారు. ఇకపోతే మణిపుర్‌లో ఓ బాంబు పేలుడు కలకలం రేపింది. అయితే ఈ పేలుడు వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంపాల్ వెస్ట్ సిటీలో సచితా కార్ హౌస్ అనే దుకాణం ఎదుట గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు బాంబు పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
పేలుడు ధాటికి షాప్‌లోని కొన్ని సామాన్లు, షాపు దగ్గర పార్క్ చేసి ఉన్న కారు ముందు భాగం ధ్వంసమయ్యాయి. బాంబ్ స్క్వాడ్‌తో పాటు మణిపుర్ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ నిపుణుల బృందం పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు, గుజరాత్‌లో అక్రమంగా ఆయుధాలను సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి సుమారు 30 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.