Take a fresh look at your lifestyle.

ఆదానీ మోదీ దోస్త్ ..అం‌దుకే విచారణకు నిరాకరణ

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : అదానీ షేర్ల ఇష్యూ పార్లమెంట్‌ను కుదిపేస్తుంది. ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుంటే.. కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు కేంద్రం వైఖరిపై మండిపడుతున్నాయి. అదానీ పీఎం మోడీ ఫ్రెండ్‌ అయినందునే కేంద్రం చర్చకు భయపడుతోదంని బీఆర్‌ఎస్‌ ‌పార్లమెంటరీ నేత కే కేశవరావు ఆరోపించారు. సభ ఆర్డర్‌ ‌లో లేదన్న సాకుతో తమ వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. రూల్‌ 267 ‌కింద 3 రోజులుగా నోటీసు ఇస్తున్నా స్పీకర్‌ ‌పట్టించుకోవడం లేదని వాపోయారు.

ఆర్థిక అంశం అయినందునే చర్చకు పట్టుబడుతున్నామని డిస్కషన్‌ ‌తర్వాతే అసలు విషయం తెలుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యనికి వెన్నుపోటు పొడుస్తోందని కేకే విమర్శించారు. ఏపీలో పోర్టులు, ముంబై ఎయిర్‌ ‌పోర్టు అదానీకే కట్టబెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదానీకి సంబంధించి అనేక అంశాలు చర్చకు రావాల్సి ఉందన్న ఆయన.. అతి తక్కువ సమయంలో ఆయన అత్యధిక ధనవంతుడుగా ఎలా ఎదిగారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. దేశాన్ని దోచుకుంటుంటే దర్యాప్తు, చర్చ జరపరా అని నిలదీశారు. షేర్ల విలువ పడిపోతుందనే చర్చను అడ్డుకుంటున్న కేంద్రం అదానీకి అండగా నిలుస్తోందని కేకే విమర్శించారు.

Leave a Reply