రాలిపోయె ఆకు కు చెట్టుకు
పేగు ఋణాను బంధం
పచ్చదనపు పర్వం తో
ఋతువు లలో ఊగి తూగి
ఇతరుల సంతోషం తన సంతోషంగా
తన అమ్మచెట్టును ఆనందం లో తడిపి
తను నేల రాలి పోదా…
బతికింది పన్నెండు మాసలే
బలే బాగ బతుకు తుంది
బలే బాగ రాలి పోతుంది…
పుట్టక నుండి మట్టిలో కలిసేదాక
స్వార్థచింతన స్వలాభాపేక్ష
ఆకులోని అణువంతైన
ప్రకృతి సేవలో ఇసుమంతైన
చిత్తం లో చిగురిస్తే
ప్రపంచమంతా పచ్చదనమే…
చెట్టు మట్టి పండుటాకు జ్ఞానం
చెట్టంత మనిషిగా నిలబెడుతుంది
రాలిపోయె ఆకులోని ఔన్నత్యం
పచ్చదనపు పరిమళం నిత్యనూతనం
రేడియమ్
9291527757