సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని
జిల్లా పోలీస్ కమిషనర్ నెరేళ్లపల్లి శ్వేతారెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేటలోని కార్యాలయంలోకేంద్ర బలగాల బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి అధికారులు, స్థానిక ఏసీపీలతో చెక్పోస్ట్, వెహికల్ చెకింగ్, ఫ్లాగ్ మార్చ్, ఈవీఎం వివిప్యాడ్ స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు గురించి సిపిసమీక్షా సమావేశం నిర్వహించారు.
సెంట్రల్ ఫోర్స్ అధికారులకు జిల్లా భౌగోళిక పరిస్థితుల గురించి ,అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి గురించి వివరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… నవంబర్ 30న జరిగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. శాంతియుత వాతావరణం లో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో కేంద్ర బలగాలు స్థానిక పోలీస్ అధికారులు అధికారులు, సిబ్బందితో కలిసి ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఎన్నికల తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా, ఓటర్ల కు భయాందోళనలకు అవకాశం లేకుండా తమ ఓటు హక్కు ను స్వేచ్ఛగా వేయడం లో భరోసా కల్పించడం లో భాగంగా ఫ్లాగా మార్చ్, రూట్ మార్చ్ లు వాహనాలు తనిఖీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు మీకు నచ్చిన వ్యక్తికి మెచ్చిన వ్యక్తికి స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికల ముందు తరువాత నిర్వహించే విధుల గురించి వివరించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తునిర్వహించడం జరుగుతుందన్నారు. జరుగుతుందన్నారు.కీలకమైన ప్రదేశాలలో సెంట్రల్ ఫోర్స్ సిబ్బందిని విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు.కేంద్ర బలగల ఉండడానికి సరైన వసతి ఏర్పాట్లు చేయాలని, వారితో కలిసి పనిచేయాలని ఏసీపీలను ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.కేంద్ర బలగాలతో మరియు జిల్లా పోలీసులతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో మండల కేంద్రాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో బిఎస్ఎఫ్ కమాండెంట్ ఇంద్రజిత్ చావ్లా, ఎస్ఎస్బి కమాండెంట్ రఘునాథ్, అడిషనల్ కమాండెంట్ రవి, అసిస్టెంట్ కమాండ్ రాజేష్ కుమార్, ధర్మరాజ్, ఎస్ఎస్ రాథోడ్, రవి, సర్వేష్, అడిషనల్ డీసీపీలు అందె శ్రీనివాసరావు, ఎస్ మల్లారెడ్డి, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు రమేష్, సతీష్, సురేందర్ రెడ్డి, చంద్రశేఖర్, రవీందర్ రాజు,ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ బిక్షపతి, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ధరణి కుమార్ తదితరులు పాల్గొన్నారు.