ప్రశ్నాపత్రం బయట పెట్టారంటూ..
కటకటాల్లోకి నెట్టారు నారాయణున్ని..
గలీజు లీకేజి పథకం ఎవరు రచించినా..
రుజువైతే తగురీతిన సన్మానించాల్సిందే !
‘అసని’ కారాదు రైతన్నకు అశనిపాతం
నోటికాడి బుక్కను లాక్కోరాదు తుఫాన్లు
ప్రకృతి విపత్తులే రైతులపాలిటి శాపాలు
సాగు వెతల్తో కర్షకుల కళ్ళల్లో సునామీలు !
కొనసాగుతున్న లంక దహనం
ఆర్పేవారెవరు ఈ రావణకాష్ఠం
ఆకలి మంటలతో రాజుకుంది అగ్గి
అన్నం దొరికితేనే ఆరును ఆవేశాగ్ని !
భానుడి భగభగలకు నరుడు బేజారు
రాజకీయ వేడితో సకల జనులు పరేషాను
అవసరానికే ఆప్యాయతల కుండపోతలు
గాలికి వదిలారు ప్రజల సంక్షేమ దీపాలు !
– డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ – 9949700037