Take a fresh look at your lifestyle.

అవినీతి కూటమికి నరేంద్ర మోదీ నాయకుడు

న్యూ దిల్లీ, మార్చి 29 : అవినీతి కూటమికి నాయకుడిగా ఉన్నారంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై కాంగ్రెస్‌  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పుతూ అవినీతిపరుల కూటమికి మోదీ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఖర్గే బుధవారం వరుస ట్వీట్లు చేశారు. బిలియనీర్‌ ‌గౌతమ్‌ అదానీ షెల్‌ ‌కంపెనీలపై కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ చేసిన ఆరోపణలను ఖర్గే ప్రస్తావించారు. అదానీ షెల్‌ ‌కంపెనీల్లో రూ. 20,000 కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టారని ప్రశ్నించారు. ’అదానీ షెల్‌ ‌కంపెనీల్లో పెట్టబడి పెట్టిన రూ.20వేల కోట్లు ఎవరివి..? లలిత్‌ ‌మోదీ, నీరవ్‌ ‌మోదీ, మెహుల్‌ ‌చోక్సీ, విజయ్‌ ‌మాల్యా, జతిన్‌ ‌మెహతా తదితరులు  ’భ్రష్టాచారి భగావో అభియాన్‌’ ‌కూటమిలో సభ్యులుగా ఉన్నారా..? ఈ కూటమికి కన్వీనర్‌ ‌రేనా..? మిమ్మల్ని రు అవినీతి వ్యతిరేక యోధుడు అని చెప్పుకోవడం ద్వారా  ఇమేజ్‌ను పెంచుకునే ప్రయత్నాలు ఆపండి’ అంటూ ధ్వజమెత్తారు.

అదానీ షెల్‌ ‌కంపెనీల్లోకి అకస్మాత్తుగా రూ. 20,000 కోట్లు వచ్చాయి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నారు.  మన డ్రోన్లు, క్షిపణుల అభివృద్ధికి ఎవరి డబ్బు ఖర్చు చేస్తున్నారు..? రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రశ్న ఎందుకు అడగడం లేదని ఖర్గే ప్రశ్నించారు. మొదట రు ఆత్మ పరిశీలన చేసుకోండి. కర్ణాటకలో ప్రభుత్వం 40 శాతం కషన్‌ ‌తీసుకుంటోందని ఎందుకు ఆరోపణలు వచ్చాయన్నారు.  మేఘాలయలో నెంబర్‌-1 అవినీతి ప్రభుత్వంలో రు ఎందుకు పాలుపంచు కున్నారు..? రాజస్థాన్‌లోని సంజీవని కోఆపరేటివ్‌ ‌స్కామ్‌లో, మధ్యప్రదేశ్‌లో సోషన్‌ ‌స్కామ్‌ , ‌ఛత్తీస్‌గఢ్‌లో నాన్‌ ‌స్కామ్‌ ‌లో బీజేపీ నేతలకు సంబంధం లేదా. అని ఖర్గే మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Leave a Reply