షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 22: షాద్ నగర్ నియోజకవర్గంలో బిజెపికి ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని భారతీయ జనతా పార్టీ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి అందె బాబయ్య స్పష్టం చేశారు. బుదవారం నియోజకవర్గంలోని కొందుర్గు మండలంలోని రేగడి చిలకమర్రి, ముట్పూర్, చుక్కమేట్, టేకులపల్లి, ఉత్తరాస్ పల్లి, భైరంపల్లి గ్రామాల్లో బిజెపి విస్తృత ప్రచారం చేపట్టారు. అభ్యర్థి అందె బాబయ్యతో పాటు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కమ్మరి భూపాల చారిజిల్లా కార్యవర్గ సభ్యులు చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ళ నర్సింహ మాదిగ, కొందుర్గు మండల అధ్యక్షులు కొమరబండ శ్రీశైలం, సీనియర్ నాయకులు ఈసారి సత్యం, కొందుర్గు మాజీ మండల అధ్యక్షులు బోయ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందే బాబయ్య, నర్సింహా డప్పుతో దండోరా వేశారు. అనంతరం బాబయ్య మాట్లాడుతూ.. అందరికి ఇచ్చారు అవకాశం.. బిజెపికి ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేసి నియోజకవర్గంలో సాగునీరు అందిస్తా, రైతుల పాదాలు తడుపుతా అన్నారు.షాద్ నగర్ నియోజకవర్గంలో నాణ్యమైన విద్యను అందిస్తానని, నియోజక వర్గ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన ఉచిత వైద్యం అందిస్తానని, ప్రతి మండల కేంద్రంలో 50 పడకల అన్ని వసతులు కలిగినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపరుస్తానని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని, స్థానిక యువతకు స్థానిక కంపెనీల్లో స్థానికులకు ఉపాధి కల్పన కల్పిస్తా, నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తా, ప్రతి గ్రామానికి ప్రజా రవాణా సౌకర్యం కల్పిస్తానని అన్నారు. గ్రామ గ్రామానికి బిటి రోడ్లు ఏర్పాటు చేసి, మండల కేంద్రానికి అనుసందానం చేస్తానని అన్నారు. ప్రతి పేదించి అర్హులైన మహిళలకు సొంతింటి కళ సాకారం చేస్తామని, నిత్యం రద్దీగా ఉండే షాద్ నగర్ పట్టణానికి ఎంఎంపిఎస్ రైళ్లను షాద్ నగర్ కు తీసుకువస్తా, విద్యార్ధుల, ఉద్యోగుల ప్రయాణ సౌలభ్యానికి కృషి చేస్తా అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని అర్హులైన నియోజకవర్గ ప్రజలకు అందేలా చూస్తానని, షాద్ నగర్ పట్టణానికి కేంద్రీయ విద్యాలయం తీసుకోస్తానని, విషాద్ నగర్ పట్టణంలో రైల్వేగేట్ ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీర్చుటకు రైల్వే ఫ్లైఓవర్స్ వెంబడే నిర్మిస్తానని పేర్కొన్నారు. ప్రతి మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల ద్వారా చేయూతను అందిస్తానని, షాద్ నగర్, కొత్తూర్ మున్సిపాలిటికి కేంద్ర ప్రభుత్వ నిధులతో పట్టణీకరణకు కృషి చేస్తాననీ అంతే బాబయ్య ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా తన సొంత మేనిఫెస్టోను తెలిపారు. బిజెపి ప్రచారానికి నియోజకవర్గంలో అపూర్వ స్పందన లభించింది….
అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి చేసి చూపిస్తా





