Take a fresh look at your lifestyle.

అధికారం కోసమే పాదయాత్రలు

  • గుజరాత్‌ ఉప్పు తింటూ గుజరాత్‌నే తిడుతున్నారు
  • రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్రపై ప్రధాని మోదీ విమర్శలు

కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్రపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అధికారం నుంచి వైదొలగిన నేతలు ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం పాదయాత్రలు చేస్తున్నారని అన్నారు. గుజారాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సురేంద్ర నగర్‌లో బీజేపీ నిర్వహించిన సభలో మోదీ మాట్లాడారు. గుజారత్‌ ‌లో తయారవుతున్న ఉప్పును తింటూ, మరోవైపు అదే రాష్ట్రాన్ని కొందరు తిడుతున్నారని అన్నారు.దేశంలో 80 శాతం ఉప్పు గుజరాత్‌ ‌నుంచే ఉత్పత్తి అవుతుందని చెప్పారు. నర్మదా డ్యామ్‌ ‌ప్రాజెక్టును 40 ఏళ్ల పాటు అడ్డుకున్న వారు కూడా ఇప్పుడు భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొంటున్నారని నర్మదా బచావో ఆందోళన నేత మేధా పాట్కర్‌ ‌ను ఉద్దేశించి మోదీ అన్నారు.

ఇటీవల ఆమె మహారాష్ట్రలో రాహుల్‌ ‌గాంధీతో కలిసి భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొన్నారు. 40 ఏళ్ల పాటు నర్మదా డ్యామ్‌ ‌ప్రాజెక్టును అడ్డుకున్న వారిని గుజరాత్‌ ‌ప్రజలు శిక్షించాలని అనుకుంటున్నారని చెప్పారు. తనపై గతంలో కాంగ్రెస్‌ అనేక వ్యాఖ్యలు చేసిందని, ఇప్పుడు ఎన్నికల సమయంలో అభివృద్ధి గురించి మాట్లాడకుండా తన గురించి మాట్లాడుతూ తన హోదా ఏంటో గుర్తుచేస్తామంటోందని మోదీ వ్యాఖ్యానించారు. తనకు ఏ హోదా లేదని తాను ప్రజల సేవకుడినని అన్నారు.

Leave a Reply