అణగారిన వర్గగాల అభ్యున్నతికి కృషి

  • జగ్జీవన్‌కు నివాళి టిఆర్‌ఎస్‌ ‌మంత్రులు, ప్రజా ప్రతినిధుల నివాళి
  • అంబేద్కర్‌, ‌జగ్జీవన్‌ల కలలను నిజం చేస్తున్న కెసిఆర్‌…‌వారి స్ఫూర్తితోనే దళితబంధు : జగ్జీవన్‌ ‌రామ్‌కు మంత్రి హరీష్‌ ‌రావు నివాళి

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 5 : ‌దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతికి భారత మాజీ ఉప ప్రధాని డా.జగ్జీవన్‌రామ్‌ ‌కృషి చేపారని టిఆర్‌ఎస్‌ ‌మంత్రులు, ప్రజాప్రతినిధులు అన్నారు. జగ్జీవన్‌ ‌రామ్‌ ‌స్ఫూర్తితో తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ‌ప్రజారంజక పాలన అందిస్తున్నారని వారు తెలిపారు. మంగళవారం జగ్జీవన్‌ ‌రామ్‌ ‌జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొని జగ్జీవన్‌రామ్‌ ‌చిత్రపటాలకు పూల మాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.  కులరహిత సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నేత డాక్టర్‌ ‌బాబూ జగ్జీవన్‌రామ్‌ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆదర్శనేత అని కొనియాడారు. జగ్జీవన్‌రామ్‌ ‌వంటి మహానీయుల ఆశయ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్‌ ‌దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. తద్వారా సామాజిక, ఆర్థికరంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌బాటలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న దళిత సమాజ సమగ్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు.

అంబేద్కర్‌, ‌జగ్జీవన్‌ల కలలను నిజం చేస్తున్న కెసిఆర్‌…‌వారి స్ఫూర్తితోనే దళితబంధు : జగ్జీవన్‌ ‌రామ్‌కు మంత్రి హరీష్‌ ‌రావు నివాళి
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పదిలక్షల రూపాయల నగదు బదిలీ చేసే దళిత బంధు పథకం తెలంగాణలోనే ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్‌ ఉం‌టే నేడు సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో రిజర్వేషన్‌ ‌తెచ్చారన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ‌డా.బీఆర్‌ అం‌బేద్కర్‌, ‌బాబు జగ్జివన్‌ ‌రామ్‌ ‌కలలను నిజం చేస్తున్నారని మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌జయంతి వేడుకల్లో భాగంగా సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్‌ ‌కూడలిలో జగ్జీవన్‌ ‌రామ్‌ ‌విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జగ్జీవన్‌ ‌రామ్‌ ఎన్నో పదవులు సుదీర్ఘ కాలం అనుభవించినా చాలా నిరాడంబర జీవితం గడిపారన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి జగ్జీవన్‌ ‌రామ్‌ అని కొనియాడారు. గాంధీజీ ఎన్నో సందర్భాలలో జగ్జివన్‌ ‌రామ్‌ను కొనియాడారనిగుర్తు చేశారు. ఆ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణలో పాలన కొనసాగిస్తున్నారి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page