- త్వరలోనే గట్లమల్యాలకు మరో 50 ఇళ్లు మంజూరు
- దసరా పండుగకు పెద్దవాగులో కాళేశ్వరం జలాలు
- గట్లమల్యాల గంగిరెద్దుల కాలనీలో 24 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహా ప్రవేశాల కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు
అందరూ నా బంధువులేనని, త్వరలోనే గట్లమల్యాల గ్రామానికి ఇంటి అడుగు జాగలో ఇళ్లు కట్టుకునే వారికి మరో 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. నంగునూరు మండలం గట్లమల్యాలలో నూతన గృహా ప్రవేశాల కార్యక్రమంలో హాజరై గంగిరెద్దుల 24 కుటుంబాల లబ్ధిదారులను గృహా ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మాట్లాడారు.
ఈ దసరా పండుగకు పెద్దవాగులో కాళేశ్వరం జలాలు తేనున్నట్లు, అలాగే ప్రత్యేక లిఫ్టు పెట్టి గట్లమల్యాలలో కాల్వలు పారించనున్నట్లు మంత్రి తెలిపారు. సిద్ధిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నర్మెట్టలో ఏర్పాటు చేసినట్లు, ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు వివరిస్తూ, ఆయిల్ ఫామ్ తోటలు విరివిగా సాగు చేయాలని, రైతులు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీన అక్కెనపల్లి గ్రామంలో వెయ్యి ఎకరాలు ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామంలో మిగులు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.