గుభాళించిన మనసులో
గుప్పుమన్న స్వచ్ఛమైన ఆలోచనలు,
ఎన్నడూ చూడని అందమైన
నవనీతం లాంటి భావాలు,
సుతిమెత్తగా మనసు తాకే
మృదు మనోహర వైఖరి
ప్రతి మాటలో
ఆదర్శంతో కూడిన ఆప్యాయత
ప్రతి చూపులో ఆదరణతో కూడిన
అభిమానం
పరవళ్లు తొక్కుతుంటే కలిగే పరవశం…
ఉరకలు తీస్తుంటే ఎగిసే పరాధీనం
క్షణం కాలం ఎదుటపడితే చాలు
మనసు తెలిపోతుంది.
జీవితమంతా ఒక జ్ఞాపకంగా
మనసును మనసై నిలిచిపోతుంది.
-సుభాషిణి వడ్డెబోయిన