అమ్మదో మతం
నాన్నదో మతం
అటు బైబిల్
ఇటు భగవద్గీత
బొట్టుకోసం సావిత్రి
యుముడితో
కోట్లాడిరదని
తెలుగు వుస్తకంలో
చదివాను!
మరి నాన్నబతికుండగానే
అమ్మ బొట్టెందుకు
చెరిపేసుకుందో !
ఎన్ని సాంఘిక శాస్త్రాలు
చదివినా
అంతుబట్టదు……!!
-శోభరమేష్
8978656327