పౌరసరఫరాల శాఖలో పరిస్థితి ఆందోళనకరం

  • ఏకంగా రూ.56 వేల కోట్ల నష్టం
  • 12 శాతం మంది రేషన్‌ వినయోగించడం లేదు
  • కొత్త కార్డులపై త్వరలోనే నిర్ణయం
  • ధాన్యం ఉత్పత్తిపై అధికారులతో సవిూక్షలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : పౌరసరఫరాల శాఖ ఆర్థికపరిస్థతి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గత పాలకుల వల్ల శాఖలో తప్పిదాలు జరిగాయని..ఏకంగా రూ.56 వేల కోట్ల నష్టంలో ఉందని మంత్రి చెప్పారు. మంగళవారం నగరంలోని సివిల్‌ సప్లై భవన్‌లో మంత్రి ఉత్తమ్‌ అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 12 శాతం వినియోగదారులు రేషన్‌కార్డులు ఉపయోగించడం లేదని చెప్పారు. కొందరు రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. గ్యాస్‌ సిలిండర్‌ హావిూ వంద రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడిరచారు. రాష్ట్రంలో రైతుల నుంచి సివిల్‌ సప్లై శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సవిూక్ష అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ..పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం సరఫరా విషయంలో మరింత పారదర్శకంగా ఉండాలన్నారు.

1.8 మెట్రిక్‌ టన్నుల బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామని, కానీ ప్రజలు వాటిని ఉపయోగించు కుంటున్నారా అన్నది మనం గమనించాలని ఆధికారుకులకు సూచించినట్లు తెలిపారు. కిలో 39 రూపాయలు పెట్టి బియ్యం సేకరించి ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామని..కానీ, అవి పేదలు తినకపోతే ఇంత పెద్ద గొప్ప ఉచిత బియ్యం పథకం నిరుపయోగం అవుతుందని అన్నారు. మొక్కుబడిగా కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బియ్యం పేదలకు ఎలా ఉపయోగకరమైన పథకంగా ఉంటుందో అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. రేషన్‌ బియ్యాన్ని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని..పేదలకు ఇస్తున్న బియ్యం వారు తినే విధంగా ఉండాలి తప్ప..

దుర్వినియోగం కావొద్దని అన్నారు. మిల్లర్ల సమస్యలపైనా అధికారులతో చర్చించామని తెలిపారు. కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. పేదలకు నాణ్యమైన రేషన్‌ బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రజలకు అవినీతిలేని పారదర్శకమైన పాలన అందిస్తామన్నారు. సచివాలయంలో యాసంగి, వర్షాకాంలో ధాన్యం ఉత్పత్తిపై అధికారులతో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లింగ్‌ సామర్థ్యం, బియ్యం నాణ్యత అధికారులు మంత్రికి వివరించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *