నాడు సమైక్య పాలకులు అప్పుల కింద 49 శాతం కేంద్రానికి కట్టబెడితే…
సంస్థ తెలంగాణకు కొంగు బంగారం
కాంగ్రెస్ హాయంలో కరెంట్, త్రాగు, సాగునీరు లేదు
సూటు కేసులు, డబ్బు సంచులు కావాలా…అభివృద్ధి కావాలా?
బాల్క సుమన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి
మందమర్రి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
సింగరేణి సంస్థ తెలంగాణ కొంగు బంగారం అని, సిరి సంపదలతో విరాజిల్లుతున్న సంస్థ అని భారాస అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం లోని మందమర్రిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ…సింగరేణి చరిత్రను యువత తెలుసుకోవాలని, సింగరేణిలో 19వేల 4వందల ఉద్యోగాలు ప్రకటించామని అన్నారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు వంద శాతం తెలంగాణకు స్వంతమయిన సింగరేణిలో అప్పులు కట్టలేక 49 శాతం కేంద్రానికి అమ్మితే…ఇప్పుడు కేంద్రంలోని బిజెపి ప్రైవేటు పరం చేయాలని చుస్తుందని కెసిఆర్ విమర్శించారు. కాంగ్రెస్ హాయంలో కరెంట్ లేదు, త్రాగునీరు, సాగునీరు అందలేదని, ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దని, ఆలోచించి వోటు వేయాలని కోరారు. ఒకప్పుడు చెన్నూర్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. బాల్క సుమన్ చేస్తున్న అభివృద్ధిని ప్రజలు ఆదరిస్తే మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతారని అన్నారు. సూటు కేసులు డబ్బు సంచులు కావాలా…అభివృద్ది చేస్తున్న బాల్క సుమన్ కావాలా…అని కెసిఆర్ ప్రశ్నించారు. మందమర్రి చాలా చైతన్య వంతం అయిన ప్రాంతం అని అన్నారు. సింగరేణిలో ఇంటి నిర్మాణం కొరకు పది లక్షలు అందిస్తామని తెలిపారు. వందల్లో ఉన్న పెన్షన్‌ను వేలల్లో తీసుకొచ్చి అందిస్తున్నామన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొస్తే ధరణి ని రాహుల్ గాంధీ తీసేస్తామని అంటున్నారని, ధరణి తీసేస్తే రైతు బంధు ఎలా వస్తుందని, ధరణి తీసేస్తే మళ్లీ దలారుల రాజ్యమవుతుందని అన్నారు. డబ్బు సంచులు, మద్యం సీసాలతో వొస్తె తన్ని తరిమేయ్యాలన్నారు. నిజమెందో..అబద్ధం ఎందో ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ కొత్త ముసుగు వేసుకొని వొస్తుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ అభివృద్ది కోసమని అన్నారు. మంచిర్యాల జిల్లాలో కొందరు నాయకులు హైదరాబాద్‌లో క్లబ్బులో పేకాట నడిపిస్తు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడనీ పరోక్షంగా ప్రేమ్ సాగర్ రావును విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు మూడు గంటలు కరెంట్ సరిపోతది అంటున్నారు, మూడు గంటలు కరెంట్ సరిపితదా అని ప్రజలను అడిగారు. దేశంలో 24గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణనే అని అన్నారు.రైతు బంధు తో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు.దేశంలో ప్రజా స్వామ్య పరణతి ఇంకా రాలేదని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లంపల్లి,చెన్నూర్ లో కోట్లు కుమ్మరిస్తున్నరని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఖతమే నని అన్నారు.బిజెపి,కాంగ్రెస్ కు బాసులు ఢల్లీిలో ఉంటారని,బిఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలే బాసు అని పేర్కొన్నారు.





