– వివాహితపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారం
న్యూదిల్లీ, మే 14: రాజధాని దిల్లీలో మరోమారు నిర్భయ వంటి ఘటన చోటుచేసుకుంది. ఓ బస్సు డ్రైవర్, కండక్టర్ తనపై అత్యాచారం చేశారన్న ఒక వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నగరంలోని రాణీబాగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం ఆమె మంగోల్‌పురిలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ పీతమ్‌పురాలో నివస్తున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు. కాగా, సోమవారం రాత్రి విధులు ముగించుకున్న ఆమె తిరిగి వస్తుండగా సరస్వతీ విహార్ వద్ద ఒక స్లీపర్ బస్సు వచ్చి ఆగింది. బస్సు డోర్ వద్ద నిలబడి ఉన్న వ్యక్తి మొదట బాధితురాలిని టైమ్ అడిగి ఆ తరువాత బలవంతంగా బస్సులోకి ఎక్కించాడు. ఆ తరువాత బస్సును నాంగ్లోయి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ నిందితులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలికి వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



