90 బీసీ సంఘాల స్పష్టీకరణ
హాజరైన బీసీ సంక్షమే సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే గ్రామ, నగర స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలన్న డిమాండ్‌ను 90 బీసీ కుల సంఘాల ప్రతినిధులు తీర్మానించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వం వహించగా తెలంగాణ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అధ్యక్షత వహించారు. హైదరాబాద్ లక్డీకపూల్‌లోని హోటల్ అశోక్‌లో శనివారం నిర్వహించిన బీసీ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్, సామాజిక శాస్త్రవేత్త నరగోని, జిల్లాలనుంచి వచ్చిన బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వమన్నారు. రాష్ట్రపతిని కలిసేందుకు ఒక్క అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని కూడా పంపలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నప్పటికీ రాష్ట్ర వైఖరి బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోందిన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టు మార్గదర్శకాలను అనుసరించి తగిన డేటా, కమిషన్ నివేదికల తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మోసం చేస్తే మండల కార్యాలయాల వద్ద నిరసనలు చేస్తాం అని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు ఊర్లలో తిరగలేని పరిస్థితులు తలెత్తుతాయి,’’ అని హెచ్చరించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ జనాభా రాష్ట్రంలో 50 శాతం మించినా, ఆదికారంలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు. అధికార ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడింది కాదని, న్యాయమైన హక్కని గుర్తించాలి,’’ అన్నారు. సామాజిక శాస్త్రవేత్త నారగోని మాట్లాడుతూ ‘‘బీసీలను స్థానిక ఎన్నికల వ్యవస్థ నుంచి దూరంగా ఉంచడం మాత్రమే కాకుండాఓటర్ల అభిమతాన్ని తక్కువ చేయడమే నన్నారు. రాష్ట్రంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న బీసీ వర్గాల నేతలు కూడా మౌనంగా ఉండటం బాధాకరం అని తెలిపారు. వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ ‘‘హైకోర్టు తీర్పు ప్రకారం కమిషన్ నివేదికలు, గణాంక ఆధారాలు లేకుండా బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యపడదని అన్నారు. బిల్లులను రాష్ట్రపతికి పంపినట్టు చెప్పి ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేస్తోందని అన్నారు. ‘‘ఈ సంద్బంగా బీసీ సంఘాల ప్రతినిధులతో కూడిన బృందం గవర్నర్ , రాష్ట్ర ఎన్నికల కమిషను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించాలని సభ ఆమోదించింది. అలాగే రాష్ట్రపతిని కలిసేందుకు అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




