ఎందుకింత మూర్ఖత్వం?

మొదటిరోజే సినిమా చూసేయాలి,  పండుగ రోజు దర్శనం చేసుకోవాలి,  పుష్కరాలప్పుడే గోదాట్లో మునగాలి,  పున్నమి రోజు ప్రదక్షిణ చేయాలి, మాల్ ఓపెనింగ్ రోజు కొనాలి, రెస్టారెంట్ మొదటిరోజే టేస్ట్ చేయాలి… ఈ మూర్ఖత్వమే కదా ప్రమాదాలకు కారణం.  మన ప్రాణాల కన్నా ఏది ముఖ్యం కాదు. మన కోసం మన కుటుంబం ఉంది. కుటుంబం లో ఒకరు లేక పోతే ఆ లోటు పిల్లలపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోండి. మనల్ని ప్రేమించే అభిమానించే వాళ్ళ కన్నా హీరోలు దేవుళ్ళు లేరు. పోయాక ఏడ్చడానికి, శవం ఎత్తడానికి దేవుడు గానీ హీరోగానీ రారు.   

 

అత్యుత్సాహం? అలసత్వం?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి.  ఏపీలో పండుగ శోభ మొదలైంది. కోనసీమలో సంబరాలు కొనసాగుతున్నాయి. చాలా చోట్ల ముగ్గుల పోటీలు మొదలయ్యాయి. రంగురంగుల రంగవల్లులతో యువతులు, మహిళలు అందమైన ముగ్గులు వేస్తూ పండగకు ముందే కొత్త శోభను తీసుకొస్తున్నారు. కోనసీమలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సందడి మరింత ఎక్కువగా ఉంది.  తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో అంబరాన్ని తాకాయి సంక్రాంతి సంబరాలు. సనాతన సారథి  ప్రాతినిధ్యం వహిస్తున్న  పిఠాపురంలో  జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సంప్రదాయ సంక్రాంతి సంబరాలు కోడిపందాలు, గుండాట, పేకాట, క్యాబరే డాన్స్, జూదం పెచ్చరిల్లి పోయాయి.  వెర్రి పుంతలు తొక్కుతున్న  ఈ ప్రక్రియ  ఏ సంప్రదాయం  ఏ సనాతనము అర్థం కావడం లేదు. మరో వైపు డాకు మహారాజ్, గేమ్ చేంజర్, పుష్ప  ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పెట్టి జనాన్ని  తొలి సినిమా టికెట్లు  పెంచుకొని  సినిమా  అంటే  సిగ్గు నీతి మానం లేనిది  అని  కొత్త అర్థం చెబుతున్న హీరోలు. ఒకవైపు  హింస, అశ్లీలత , అనైతికత, విచ్చలివిడితనం, తాగుడు పెంచి పోషించే సినిమాలను ప్రోత్సహిస్తూ మరో  వైపు  విద్యార్థులలో నైతికత నైపుణ్యత  పెంపొందించడానికి క్యాబినెట్ హోదాలో కలిగిన  చాగంటి గారిని   సలహాదారులుగా నియమించారు.
       మొదటిరోజే సినిమా చూసేయాలి,  పండుగ రోజు దర్శనం చేసుకోవాలి,  పుష్కరాలప్పుడే గోదాట్లో మునగాలి,  పున్నమి రోజు ప్రదక్షిణ చేయాలి, మాల్ ఓపెనింగ్ రోజు కొనాలి, రెస్టారెంట్ మొదటిరోజే టేస్ట్ చేయాలి. ఈ మూర్ఖత్వమే కదా ప్రమాదాలకు కారణం.  మన ప్రాణాల కన్నా ఏది ముఖ్యం కాదు. మన కోసం మన కుటుంబం ఉంది. కుటుంబం లో ఒకరు లేక పోతే ఆ లోటు పిల్లలపై ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోండి. మనల్ని ప్రేమించే అభిమానించే వాళ్ళ కన్నా హీరోలు దేవుళ్ళు లేరు. పోయాక ఏడ్చడానికి, శవం ఎత్తడానికి దేవుడు గానీ హీరోగానీ రారు.  తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు.  వైకుంఠ ఏకాదశి నాడు లక్షల సంఖ్యలో జనం తిరుమలకు వస్తారన్న అంచనాలు ఉన్నప్పటికీ దానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్పష్టత లోపించడం వైఫల్యంగా కనిపిస్తున్నది. తిరుపతిలో ఏర్పాటు చేసే టికెట్‌ కేంద్రాలు స్థానికులకు మాత్రమేనని గతంలో ప్రకటించేవారు. ఎవరైనా ఇతర ప్రాంతాల భక్తులు కౌంటర్ల దగ్గరకు వచ్చినా టికెట్లు ఇచ్చేవారు. ఈ దఫా లోపం ఏమంటే, టికెట్‌ లేని వారిని తిరుమల కొండకు అనుమతించబోమని యాజమాన్యం ప్రకటించింది.
దీనివల్ల ముఖ్యంగా తమిళనాడు ప్రాంతం నుంచి చాలా పెద్ద సంఖ్యలో ఎలాగైనా వైకుంఠ ద్వారాలలో ప్రవేశం పొందాలనే ఆతృతతో భక్తులు తిరుపతి చేరుకున్నారు. బుధవారం ఉదయానికి దూర ప్రాంతాల నుంచి రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయిన భక్తులు టికెట్‌ కౌంటర్లకు చేరుకున్నారు. గురువారం ఉదయం ఐదు గంటల నుంచి టికెట్లు ఇస్తారని ముందస్తుగా అధికారులు ప్రకటన చేసినా బుధవారం ఉదయం 10 గంటలకు కౌంటర్ల దగ్గరకు భక్తులు చేరుకోవడం మొదలైంది. ప్రతి గంటకు భక్తుల సంఖ్య పెరగడం ఉదయం నుంచి కనబడుతూనే ఉంది. పెరుగుతున్న సంఖ్యను దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ ఘటన జరిగేది కాదు.  జన సమ్మర్థం గా ఉన్నటువంటి ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో సన్నని ఇరుకు దారులలో వీటిని ఏర్పాటు చేయడం, మలమూత్ర విసర్జనకు కూడా అవకాశం లేకుండా ఉండటం, ఆఖరుకు ఆహారం, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి వేచి ఉండటం అడుగడుగునా కనిపించింది.
3,000 మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్‌ సిబ్బందితో ప్రశాంతమైన వాతావరణంలో దర్శన ఏర్పాట్లు చేశామని ప్రకటించారు. ఇన్ని వేల మంది పోలీసులను కేటాయించామని చెబుతున్నా కౌంటర్లు దగ్గర భక్తులను నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి పోలీసులు పరిమిత సంఖ్యలో ఉండటం ఈ దుస్థితి కారణంగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  ఎన్నో  ప్రాణాలు గాలిలో కలిసిన, ఎందరో క్షతగాత్రులైన  తరువాత  ఇప్పుడు మనం చింతించడం తప్ప చేసేది  ఏమి లేదు   అని నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేసిన   టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు.  టీవీ రంగంలో  నిష్ణాతుడైన  బి ఆర్ నాయుడు  ఈ మధ్యనే  చైర్మన్ గా వచ్చారని  ముఖ్యమంత్రి  ఆయనను  వెనకేసుకు రావడం చూస్తుంటే ఎక్కడికి వెళుతున్నారో  అర్థం కావడం లేదు.  మరోవైపు  ప్రీ రిలీజ్  ఫంక్షన్ రద్దు చేసుకొని మంత్రులు, టిటిడి బోర్డు సభ్యులు  క్షతగాత్రుల పరామర్శకు క్యూ కట్టారు. మూడు సంవత్సరాల కిందట వచ్చిన కొరోనా మనల్ని సామజిక దూరం పాటించమని చెప్పింది, గత సంవత్సరం  బాబా గారి  పాదాల కింద భూమిని  తాకడానికి  117 మంది బలైపోయారు,   ఇప్పటికే  చైనా నుంచి మరో వైరస్ తొంగిచూస్తోంది.  ఏది  ఏమైనా  ప్రజలు  జాగరూకత  అవసరం. తొక్కిసలాటల్లో విలువైన ప్రాణాలు తీసుకోకండి.  సంయమనం పాటిస్తే అందరికీ మంచిది.
image.png
డా. ముచ్చుకోట. సురేష్ బాబు, 
అధ్యక్షుడు, ప్రజాసైన్స్ వేదిక. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page