ఆత్మత్యాగం చేసిన వారికన్నా ఎవ‌రు గొప్ప‌?

-శ్రీకాంతచారి ఆత్మత్యాగం ఎందుకు  గుర్తుకు రావడం లేదు
– గద్దర్‌, ‌కోదండరాం, అందె శ్రీ, గూడ అంజయ్యలను ఎందుకు విస్మరించారు?
-కేటీఆర్‌ ‌వ్యాఖ్యలకు  ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంట‌ర్‌

 తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్‌ ‌దీక్షను పెద్దదని చెప్పుకోవడం ఎంత‌వ‌ర‌కు స‌రైంద‌ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ‌ప్రశ్నించారు. కేసీఆర్‌ ‌చేసిన దీక్ష నిజంగా ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసని, ఆ దీక్షను మహోన్నతంగా చూపించడానికి బీఆర్‌ఎస్‌ ‌ప్రయత్నం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై ఆయ‌న‌ ‌తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాన్‌ ‌రెడ్డి, కానిస్టేబుల్‌ ‌కిష్టయ్య వంటి అమరవీరుల త్యాగాలు ఎంత గొప్పవో గుర్తు చేశారు. అలాంటి త్యాగాలను పక్కన పెట్టి కేసీఆర్‌ ‌దీక్షను ప్రోత్సహించడం బీఆర్‌ఎస్‌ ‌నాయకుల రాజకీయ నాటకమని అన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు చూపుతున్న గౌరవం ప్రత్యేకమని, కేసీఆర్‌ ‌మాత్రం ఉద్యమకారులను జైల్లో పెట్టిన చరిత్ర కలిగి ఉన్నాడని దయాకర్‌ అన్నారు. తెలంగాణ ప్రజల రుణం తీర్చుకునే పనిలో రేవంత్‌ ‌రెడ్డి ఉన్నారని, ఆయన పాలన మానవతా స్పూర్తిని ప్రతిబింబిస్తోందన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కేసీఆర్‌ ‌దీక్షపై విమర్శలు చేస్తే కేటీఆర్‌ ఎం‌దుకు అంత అసహనం చూపుతున్నాడని దయాకర్‌ ‌ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో పనిచేసిన కాలంలో తెలంగాణ కోసం చిన్నారెడ్డి సంతకాల సేకరణలో మహేష్‌ ‌గౌడ్‌ ‌కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. సాగరహారం రోజున కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ఎక్కడ ఉన్నారని కూడా ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ‌నాయకత్వంపై దయాకర్‌ ‌ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. కాంగ్రెస్‌ ‌విలీనానికి కేసీఆర్‌ అవకాశవాద రాజకీయాల వల్లే అడ్డుపడ్డాడని, మిలియన్‌ ‌మార్చ్‌ను కూడా వ్యతిరేకించాడని తెలిపారు. గద్దర్‌, ‌కోదండరాం, అందె శ్రీ, గూడ అంజయ్య వంటి ఉద్యమకారులు కేసీఆర్‌కు నచ్చరని అన్నారు. ఉద్యమ సమయంలో మరణించిన శ్రీకాంతాచారిని బీఆర్‌ఎస్‌ ‌గుర్తు చేసుకోవడం లేదని ఎత్తి చూపారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఏర్పడిందని కేసీఆర్‌ అనేకసార్లు చెప్పినా, అదే సోనియా గాంధీని తర్వాత అవమానించడం అతని స్వభావానికి నిదర్శనమని దయాకర్‌ ‌చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను చంపడానికి కేసీఆర్‌ ‌ప్రయత్నించాడని ఆరోపించారు. రేవంత్‌ ‌రెడ్డి సీఎం అయ్యి సోనియా గాంధీకి తెలంగాణ బహుమతి ఇచ్చారని, బీఆర్‌ఎస్‌గా మారిన రోజే కేసీఆర్‌ ‌పార్టీలో తెలంగాణ ఆత్మ చనిపోయిందని విమర్శించారు. అందె శ్రీ అంత్యక్రియల సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి చూపిన మానవత్వం అందరిని ఆకట్టుకుందని అన్నారు.కేటీఆర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీపై వ్యాఖ్యలు చేస్తే సహించబోమని దయాకర్‌ ‌హెచ్చరించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో 420 ముద్ర వేసుకున్న నాయకులు మాత్రమే మిగిలారని, సర్పంచ్‌ ఎన్నికల్లో సెంటిమెంట్‌ ‌కోసం హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం పేరిట రాష్ట్రాన్ని దోచుకున్నవారు బీఆర్‌ఎస్‌ ‌నాయకులేనని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *