విలీన రాజకీయాలతో ఎవరికి ప్రయోజనం..?

“విలీనంపై రేవంత్, బీజేపీ నేతల ఆరోపణలను   పరస్పరం వెనుకెసుకోస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇది బీఆర్ఎస్‌పై జాతీయ పార్టీల ఉమ్మడి దాడి అన్న చర్చ ఉంది.కేవలం రాష్ట్రంలో సమస్యలు గాలికి వదిలేసి ప్రజలకు పనికిరానీ, వ్యక్తిత్వ రాజకీయాలను  రేవంత్‌ ,బీజేపీ నేతలు తెరపైకి తేస్తున్నారని జనాలు మండిపడుతున్నారు.ప్రజా సమస్యలపై చర్చల జరగకుండా చిట్‌ చాట్ తో డైవర్సన్‌ పాలిటిక్స్ చేస్తూ పదేపదే బీఆర్ఎస్ విలీనం ప్రకటనలు ఎవరికి లాభం అని ప్రశ్నిస్తున్నారు.”
కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయాలు విలీనం, సవాళ్లు,ప్రతిసవాళ్ల చుట్టే తిరుగుతున్నాయి. రాజకీయ వేడి రగులుతుంది ..అధికార, విపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రజా సమస్యలపై చర్చ పక్కదారి పట్టింది. పాలిటిక్స్‌ డైనమిక్‌గా మారుతున్నాయి, కానీ ప్రజల జీవితాల్లో ఏ మార్పు కనిపించడం లేదు. హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే.విపక్షమే తమను పని చేయనీయడం లేదని విమర్శలు చేస్తుంది.
ప్రతిపక్షం ట్రాప్‌లో అధికార పార్టీ పడుతుంది.బీఆర్ఎస్‌ విమర్శలకు కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్‌ ప్రజలకు ఇచ్చిన హామీలపై ఫోకస్‌ పెట్టడం లేదు.జనాలను మెప్పించలేక వారికి దూరం అవుతుంది.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం విజుల్‌ బ్లోయర్‌గా పని చేస్తు సర్కార్ తప్పులను ఎత్తి చూపేందుకు కాచుకు కూర్చుంటుంది..ప్రభుత్వం ఏ చిన్న తప్పు చేసిన అటాక్‌ చేసేందుకు  రాజకీయ ఆయుధాలతో  మూకుమ్మడి దాడి చేస్తుంది..బ్రిటన్‌లో లాగా ప్రభుత్వానికి సమాంతర మంత్రివర్గాన్ని ఏర్పడిచే వ్యవస్థ మన దేశంలో లేనప్పటికీ, పరోక్షంగా ప్రతిపక్షాలు అలాంటి విధానాన్ని ఫాలో అవుతాయి.
విపక్షం ట్రాప్‌లో పడకుండా అధికార పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తుంది.ప్రతిపక్షానికి ప్రజలు దగ్గర కాకుండా శత విధాలుగా సర్కార్‌ పని చేస్తుంది. అయితే వైరి వర్గాన్ని నిలువరించేందుకు అధికార పార్టీకి ఆర్థిక అంగబలంతో పాటు ప్రభుత్వం నీడలో నడిచే మీడియా ఉంటుంది. అదే సమయంలో ప్రజలు అధికార పార్టీ కంటే ప్రతిపక్షాన్నే ఎక్కువ విశ్వాసిస్తారు..సర్కార్‌కు మద్దతుగా ఉన్నట్లు కనిపించిన పరోక్షంగా విపక్షాల  ప్రజా పోరాటాలను స్వాగతిస్తారు.అది ప్రతిపక్షానికి  ప్రజల్లో ఉన్న విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది..దేశంలో అయిన రాష్ట్రాల్లో అయినా ఇదే సూత్రం అమలవుతుంది..అదే ప్రజాస్వామ్య వ్యవస్థ బ్యూటీ.
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను మూటగట్టే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తుంది.అధికార పార్టీ హామీల వైఫల్యాలపై ప్రజా ఐక్యతను కూడగట్టుతుంది.ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎన్నికల వరకు తీసుకుపోయే ప్రయత్నం ప్రతిపక్షం చేసుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గకుండా ప్రజలను చైనత్యం చేస్తూ, ఉత్తేజపర్చుతూ  సర్కార్ ను ఇరుకులో పెట్టుతు ఊపిరాడకుండా చేస్తుంది..ఒకసారి ప్రతిపక్షం ట్రాప్‌లో అధికార పార్టీ పడితే ప్రభుత్వానికి వరుసుగా ఎదురుదెబ్బలు తగులుతాయి..దాన్ని నుంచి తెరుకోవడం చాలా కష్టం.
బీఆర్ఎస్‌ పార్టీ విమర్శల దాడిని తిప్పికొట్టడంతో ప్రభుత్వం విఫలం అవుతుందని చెప్పవచ్చు.అధికార బలం, అర్థ బలమున్న,మీడియా మద్దతున్నా,  ప్రతిపక్షం చేస్తున్న చిన్నపాటి నిరసన కూడా ప్రభుత్వానికి పెద్దగా కనిపిస్తుంది.ప్రజల్లో సర్కార్‌ ప్రజా విశ్వాసం కోల్పోతుందన్న భయం కాంగ్రెస్‌ను నీడలా వెంటాడుతుంటే,  కాంగ్రెస్‌ చేసిన పనులు చెప్పుకోడం కంటే..డైవర్షన్‌ పాలిటిక్స్‌ను నమ్ముకున్నట్లు కనిస్తుంది.
ప్రభుత్వం జనాగ్రహానికి గురికాకుండా ఉండేందుకు సీఎం రేవంత్‌ కాళేళ్వరం కమిషన్‌, ఫార్మూలా ఈ-రేస్‌ కేసు,అప్పులనే ఆయుధాలను నమ్మకున్నారు.శత్రువుకు  బలమైన ప్రజాయుధం ఇచ్చిన రేవంత్‌, కేసులు విచారణలు వంటి ఆయుధాలతో కాంగ్రెస్ యుద్దం చేస్తుంది..ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాయుధానికి మించిన బ్రహ్మాస్త్రం మరోకటి ఉండదు.
అనేక అంచనాల మధ్య కాంగ్రెస్‌కు ప్రజలు పట్టకట్టారు.ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రభుత్వాన్ని నడిపించకుండా.బీఆర్ఎస్‌పై కోపంతో పాలన చేయడం వల్ల కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తలుగుతాయి.ఇప్పటికే ప్రతిపక్షంపై ప్రతీకార రాజకీయాలు చేస్తుందన్న చర్చ ప్రజల్లో రోజురోజుకు బలపడుతుంది.అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తుంది.ఇప్పటికీ ప్రజల అంచనాలను రేవంత్‌ అందుకోలేకపోయారు.పైగా ఇంకా వెండేట పాలిటిక్స్‌ వల్ల నష్టమే తప్ప లాభం లేదన్న వాదన కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.
మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి కాంగ్రెస్‌ పార్టీ స్వయంకృతాపరాధమే కారణం అంటున్నారు పొలిటికల్స్ పండిట్స్‌.బీఆర్ఎస్‌ పని అయిపోయిందంటునే మరోవైపు ప్రతిపక్షం బలపడేలా రేవంత్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు..ఏ ఆస్థిత్వం కోసం బీఆర్ఎస్‌ పార్టీ పురుడు పోసుకుందని గులాబీ నేతలు చెపుకుంటారో.వారి వాదనకు బలం చేకూరేలా కాంగ్రెస్‌ తీరు ఉంది.పాలనలో తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్‌ బలోపేతానికి తెలియకుండా కాంగ్రెస్‌ పరోక్షంగా కారణం అవుతుంది.
అంతేకాదు, తెలంగాణ అస్థిత్వ గాయాన్ని రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ నిత్యం  పొడుస్తూ బీఆర్ఎస్‌కు రాజకీయ అస్త్రాన్ని ఇస్తుంది.ఎవరూ అవునన్న కాదన్న తెలంగాణ కోసమే బీ(టీ)ఆర్ఎస్‌ పుట్టిందన్న విశ్వాసం అయితే ఇప్పటికీ మెజార్టీ ప్రజల్లో ఉంది..బీఆర్ఎస్‌ బీజేపీలో విలీనం అవుతుందని, ఈ మేరకు చర్చలు జరిగాయని రేవంత్‌ రెడ్డి అండ్‌ బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు…బీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టి, ప్రజలకు ప్రతిపక్షాన్ని దూరం చేయాలన్న ఉద్దేశ్యంతో రేవంత్‌ ,బీజేపీ చేస్తున్న ఆరోపణలు ప్రజా క్షేత్రంలో బూమరాంగ్ అవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతపై, ప్రతిపక్ష ఆరోపణలపై ప్రజల్లో చర్చ జరగకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర చేస్తున్నారనే విమర్శలు  వ్యక్తం అవుతున్నాయి.బీఆర్ఎస్‌ను బలహీనపర్చాలని కాంగ్రెస్‌ ,బీజేపీ వ్యూహత్మంగా విలీన ప్రకటనలు చేస్తున్నారన్న చర్చ ప్రజల్లో జరుగుతుంది. అంతేకాదు రేవంత్‌, బీజేపీ  విలీనం ప్రకటనలు రాష్ట్రంలో బీఆర్ఎస్‌ బలపడుతుందన్న చర్చ పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిస్తుంది.
ప్రభుత్వ వైఫల్యాలు,కాంగ్రెస్‌ గ్యారంటీలపై విమర్శలు చేసిన ప్రతిసారి ఆరోపణలకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్‌ బీజేపీలో విలీనం అంటూ తెరపైకి రేవంత్‌ బీజేపీ నేతలు తీసుకువస్తున్నారన్న వాదన ప్రజలో బలపడుతుంది.తెలంగాణ వచ్చిన తర్వాత ఏ పార్టీ ఎందులో కలిస్తే తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.విలీనాలు చర్చలు ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజం. అందులో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో పొత్తుపెట్టుకోవడం కామన్‌..  తెలంగాణలో బీఆర్ఎస్‌ అధికారంలో లేదు. అది ఏ పార్టీలో విలీనం అయితే నష్టం లేదు. పవర్‌లో ఉండి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తే అది రాష్ట్రానిక ద్రోహం అవుతుంది కానీ పవర్ లోనే లేనప్పుడు అది ఏ పార్టీతో పోతేంది..కలిస్తేంది..!
రాష్ట్రంలో బీజేపీ-రేవంత్‌ రెడ్డి కుమ్మక్కై ఉమ్మడి రాజకీయ ఎజెండా అమలు చేస్తున్నారని బీఆర్ఎస్‌ చేస్తున్న విమర్శలకు బీఆర్ఎస్‌ బీజేపీలో విలీనం, పోత్తు ఆరోపణలు రాజకీయ కౌంటర్‌గా పనికి వస్తుంది తప్ప కాంగ్రెస్‌కు ఉపయోగం లేదు.వెరసి ఇలాంటి ప్రకటనలు బీఆర్ఎస్‌కే లాభం చేస్తుందన్న విశ్లేషణలున్నాయి.జాతీయ స్థాయిలో ఆగర్భ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్ బీజేపీలు విలీనం అంటూ గొంతుకలుపుతుండంతో బీజేపీ రేవంత్‌ ఒక్కటే అన్న బీఆర్ఎస్ ఆరోపణలకు బలం చేకూరుతుంది.
విలీనంపై రేవంత్, బీజేపీ నేతల ఆరోపణలను   పరస్పరం వెనుకెసుకోస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇది బీఆర్ఎస్‌పై జాతీయ పార్టీల ఉమ్మడి దాడి అన్న చర్చ ఉంది.కేవలం రాష్ట్రంలో సమస్యలు గాలికి వదిలేసి ప్రజలకు పనికిరానీ, వ్యక్తిత్వ రాజకీయాలను  రేవంత్‌ ,బీజేపీ నేతలు తెరపైకి తేస్తున్నారని జనాలు మండిపడుతున్నారు.ప్రజా సమస్యలపై చర్చల జరగకుండా చిట్‌ చాట్ తో డైవర్సన్‌ పాలిటిక్స్ చేస్తూ పదేపదే బీఆర్ఎస్ విలీనం ప్రకటనలు ఎవరికి లాభం అని ప్రశ్నిస్తున్నారు.
తెలంగావాదాన్ని నిత్యం సజీవంగా ఉంచుతున్నదెవరూ, రాజకీయ లాభం పొందుతున్నదెవరో రేవంత్‌కు బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనంతో కాంగ్రెస్‌కు ఏం లాభమో తెలియక నేతలు తలలు పట్టుకుంటున్నారు. బీఆర్ఎస్‌ బీజేపీలో విలీనం ప్రకటనలు రేవంత్‌ రెడ్డితో బీజేపీ గొంతుకలపడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నష్టమే తప్ప లాభం ఉండదు.
అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా విలీనం వార్తలు రేవంత్‌ విస్తృతంగా ప్రచారంలో పెట్టారు.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ కంటే ఒకటిన్నర శాతం వోట్లు మాత్రమే కాంగ్రెస్‌కు వచ్చాయంటే విలీనం వార్తలు ప్రజలు నమ్మలేదని అర్ధం అవుతుంది. బీఆర్ఎస్‌ వోట్ బ్యాంక్‌ కాంగ్రెస్‌ కాకుండా బీజేపీకి వెళ్లింది.ఇది కాంగ్రెస్‌కు నష్టమే చేసింది..
ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనపడుతుంది.బీజేపీ అధ్యక్షుడి విషయంలో అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పే చేసిందన్న చర్చ ఉంది..రేవంత్‌, బీజేపీ విలీనం ప్రకటనలు చేయడం, దాన్ని బీఆర్ఎస్‌ తిప్పికొట్టడంతో నష్టం కాంగ్రెస్‌కే జరుగుతుందన్న విశ్లేషణలున్నాయి..అంతేకాదు బీఆర్ఎస్ ను గ్రౌండ్ లో   బలోపేతం చేసేందుకు ఒకవైపు కవిత, మరోవైపు హరీష్ రావు, కేటీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఇలాంటి టైం లో ప్రజలకు దగ్గరవ్వకుండా విలీనాలు విచారణలు అంటూ కాలం వెల్లదీస్తే అది బీఆర్ఎస్ కే రాజకీయ లబ్ది జరుగుతుందన్న విశ్లేషణలున్నాయి.
తెలంగాణ నా వల్లే వచ్చింది..బీఆర్ఎస్ పార్టీ సాధించిందని కేసీఆర్, గులాబీ నేతలు పదేపదే ప్రకటించుకుని ప్రజలకు దూరం అయింది.ఇప్పుడు రేవంత్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజాసంఘాలు,ప్రజాస్వామ్య వాదులును కించపర్చేలా నా వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది..నేనే పవర్‌లో తీసుకువచ్చిన అని ప్రకటించుకోవడం వల్ల ప్రజాస్వామ్యవాదులు రేవంత్‌ తీరుపై భగ్గుమంటున్నారు. బీఆర్ఎస్‌ నాయకులపై ఆగ్రహం, ప్రజా సంఘాల కృషితో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు తప్ప రేవంత్‌ మీద నమ్మకంతో కాదని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు.
-తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *