పహల్గాం లో నల్గురు ఉగ్రవాదులు ప్రవేశించి 26మంది పర్యాటకులను వాళ్ళు కుటుంబ సభ్యులు ముందే కాల్చిచంపితే! దేశమంతా అట్టుడికి పోయింది. ఉగ్రవాద చర్యలపట్ల ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మానవీయ కోణం నుండి చూసినప్పుడు నిజంగా ఈ ఉగ్రవాద చర్య అమానుషం,అమానవీయం.మరోవైపు దేశ సరిహద్దు పహల్గాం లాంటి చోట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలను కాపాడవలసిన సైన్యం ఏడాదికాలంగా “కగార్”ఆపరేషన్ పేరుతో మద్యబారతం లోని దండకారణ్యంలో సైనిక చర్య చేపడుతుంది.ఎవరిమీద ? బారతీయ పౌరులైన నక్సలైట్లు, వారికి మద్దతు ఇచ్చిన గిరిజనుల మీద? సరిహద్దులో పరాయి దేశం పాకిస్తాన్ మీద ఏడు రోజుల్లో యుద్ధం ఉద్రిక్తత సమసిపోతే మన మధ్య భారతం లో మాత్రం ఏడాదికాలంగా ఆధునిక డ్రోన్లు,హెలీకాప్టర్లు,విధ్వంసకర ఆయుధాలతో ఆపరేషన్ “కగార్”రూపంలో మన దేశీయ పౌరులు పైనే యుద్ధం కొనసాగుతుంది.
ఇప్పటికే ఒక అంచనా ప్రకారం 500 మందివరకు నక్సలైట్లు,వారి మద్దతు దారులు ఐనా గిరిజనుల ను మట్టు పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. బయటకు పొక్కే సమాచారం కంటే బయటకు తెలియని హింస ఎంతో కొనసాగుతుందని పౌరహక్కుల సంఘాలు, మానవీయత ఏదో ఒక మూల దాగిఉన్న ప్రజాస్వామిక వాదులు వాపోతున్నారు. రాజ్యాంగం భారత పౌరులకు సంక్రమింపజేసిన జీవించే హక్కు ఇప్పుడు దండకారణ్యం లో ప్రశ్నార్థకంగా మారింది.ఈ దశలో అసలక్కడ ఏమి జరుగుతుందో స్వేచ్ఛ గా తెలుసుకునే అవకాశం కనిపించడంలేదు? మీడియా కూడా పోలీసులు అందించిన కధనాలు,అరకొర తెలిసిన సమాచారం వండివార్చడం తప్ప నిజాయితీ, నిర్భయంగా స్వేచ్ఛగా రిపోర్టు చేసే పరిస్థితి లేదు. దండకారణ్యంలో గత ముపైఏళ్ళుగా మావోయిస్టులు పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రజాసమస్యలు తీసుకొని పనిచేశారు కనుకనే ఇన్నేళ్లుగా ఆయా ప్రాంతాల్లో మన గలిగారు.అడపాదడఫా జరిగిన సంఘటనల్లో పోలీసులు, నక్సలైట్లు చనిపోయి ఉండవచ్చును.
సరిహద్దుల్లో యుద్ధం జరిగితే శత్రుదేశాల సైనికులు గాయపడితే చికిత్స చేసి జైలులో నిర్భంధం విధిస్తారు! పరస్పరం దాడిలో ప్రాణం కోల్పోయిన సందర్భంలో విధినిర్వహణలో మరణించిన సైనికులను ప్రత్యర్ధి సైనికులు గౌరవిస్తారు.కానీ, ఇదెక్కడి ద్వేషమో కొత్తరకం ట్రైండ్, అమానవీయత కనిపిస్తుంది.మరణించిన నక్సల్స్ అగ్రనేత మృత దేహం తో పాటు,26మృతదేహాలు ఒకచోట పేర్చి , వాటి వెనుక నిలబడి తుపాకులు గాలిలో ఊపుతూ,అరుస్తూ కేకలు వేయడం, నృత్యాలు చేయడం కొన్ని చానళ్ళు,సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా ఇదెక్కడి సాంప్రదాయం? ఇదెక్కడి మానవీయత?? శవాలు ముందు నృత్యం చేయడాన్ని మన పురాణాల ప్రమాణాల్లో చూస్తే రాక్షస క్రీడ గా చెప్పుకుంటాము. నిజంగా ఆ పనిచేసింది సైనికులేనా?అనుమానాలు ఉన్నాయి.
గతముపై ఏళ్ళ కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులు కు వ్యతిరేకంగా అనేక వ్యూహాలు అనుసరించారు. తొలుత సల్వాజుడుం పేరుతో (శాంతి సేన) మావోయిస్టు వ్యతిరేకులు కూడ దీసి ఆయుధాలిచ్చి మావోయిస్టులు పైకి ఉసిగొల్పారు. అందుకు ప్రతిగా మావోయిస్టులు “భూంకాల్ మిలీసియా”భూ పోరాటసేన పేరుతో గిరిజనుల ను సమీకరించి ఎదుర్కొన్నది. రెండువైపులా జరిగిన వెర్షన్లో ఓ లక్షమంది మోరియా జాతి గిరిజనులు కట్టుబట్టలతో అప్పటి ఉమ్మడి రాష్ట్రం అడవులు తో పాటు, రాష్ట్ర సరిహద్దులు దాటి చెన్నై వరకు వలస వెళ్ళి పరాయి పంచన ద్వితీయ జాతి పౌరులు గా జీవిస్తున్నారు. కొన్నిసందర్భాల్లో అక్కడి ప్రభుత్వాలు వీరికి కనీసం రేషన్ కార్డు ఇవ్వ నిరాకరించిన అమానవీయ పరిస్థితులు ఎదుర్కొని స్థిరపడ్డారు. అటు తర్వాత జరిగిన ఎన్కౌంటర్,దాడుల్లో అడపాదడపా పోలీసులు, నక్సల్స్ మరణించిన స్థానిక సంఘటనలు గానే నమోదు అయ్యాయి. మావోయిస్టులు దీర్ఘకాలిక వ్యూహం లో భాగంగా స్థానిక గిరిజనులు లోతనదైన”జనతా సర్కార్”అనబడే పరిపాలనా వ్యవస్థను తనదైన శైలిలో నడిపింది. దీర్ఘ కాలిక మావోయిస్టు వ్యూహం తో “పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మి”ని ఏర్పరిచింది. అయినప్పటికీ అడపాదడపా చేసుకున్న దాడులు, ప్రతిదాడులు తప్ప శాంతిభద్రతలకు పెద్దగా ఆ పరిపాలనాసంస్థలు విఘాతం కల్పించిన సంఘటనలు పెద్దగా లేవు!? ఎవరి వ్యూహాలు వారు అనుసరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి ప్రభుత్వం కు వామపక్ష సంస్థ అయిన మావోయిస్టులు తో పరస్పర వ్యతిరేక సైద్ధాంతిక వైరం కలిగి ఉన్నాయి.
దండకారణ్యంకు కేంద్ర బిందువుగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు, దండకారణ్యంలో కీలకమైన భవిష్యత్ యుద్దం వ్యూహంకు కీలకం అయిన యురేనియం తోపాటు,బాక్సైట్ లాంటి విలువైన అనేక ఖనిజాలు ఉండడంతో మావోయిస్టుల ఉనికి వాటిని వెలికి తీయడానికి కష్టం అవడంతో తాడోపేడో తేల్చుకునేందుకు “కగార్”ఆపరేషన్ కు కేంద్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది.సరిహద్దులో ఉండాల్సిన వేలాది సైన్యంను మధ్య భరతం దండకారణ్యం లో మోహరించింది. ఆదునిక ఆయుధ సంపత్తి, సాంకేతిక పరిజ్ఞానం సైతం వినియోగం చేస్తూ మావోయిస్టులను చుట్టుముట్టి చక్రభందంలో బిగించి వెంటాడి మరీ వెంటాడి చంపేస్తుంది. చనిపోతున్నవారిలో ఒకరో ఇద్దరో తెలంగాణా, ఆంద్రప్రదేశ్ కు చెందిన నాయకులు ఉంటే 90శాతం మృతులు గిరిజనులే ఉంటున్నారు. ప్రతి సందర్భంలో ఎన్కౌంటర్లలో చనిపోయిన గణాంకాలు అన్ని ఇదేవిషయం తేటతెల్లం చేస్తున్నాయి. మరణించిన గిరిజనుల లో అధికభాగం అమాయకులు, గ్రామీణులు ఉంటున్నారని పౌరహక్కుల సంఘాలు అంటుంటే పోలీసులు మాత్రం లొంగిపోయిన వారిని చంపడం లేదని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇంటర్యూలు ఇస్తున్నారు. నక్సలైట్లు కూడా జరుగుతున్న నష్టం రీత్యా ఓ అడుగు వెనక్కి వేసి “కర్రెగుట్ట”దాడులు సందర్భంలో చర్చలు ప్రతిపాదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాక్షాత్తు మన హోం మంత్రి అమిత్ షా, ప్రదాని మోదీ నే మావోయిస్టు లను హతమార్చడానికి 2026మార్చి ని డెడ్ లైన్ గా ప్రకటించడంతో చట్టబద్దం గానే హత్యలకు, దాడులకు లైసెన్స్ ఇచ్చినట్లు అయ్యింది? “కంచే చేనుమేస్తే కాపేమిచేయు”అన్నసామెతలాగా పరాయి దేశంపైన యుద్ద హెచ్చరికలాభారతీయ పౌరులపైన ఇలాంటి బహిరంగ ప్రకటనలు ఇంతకుముందు ఎన్నడూ కనివినలేని పరిస్థితి!?
తాజాగా జరిగిన ఎన్కౌంటర్ లో సిపిఐ (మావోయిస్టు) అగ్రనేత నంబాల కేశవరావు తోపాటు,ఆయన సహాయకులు, అంగరక్షకులు ఎన్కౌంటర్ చేయబడ్డారు.ఎక్కడో పట్టుకొని తెచ్చికాల్చారని మావోయిస్టు సానుభూతిపరులు ఆరోపిస్తుండగా, దాడిలోనే 27మంది చనిపోయారని పోలీసులు ప్రకటించారు.మృతదేహాలు కూడా బంధువులకు ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. కోర్టునుకూడా లెక్క చేయకుండా అక్కడే పోలీసులు దహనం చేశారనే సమాచారం వస్తుంది. ప్రజాస్వామ్యంలోఇంతకంటే అవమానకరమైన విషయం మరొకటి ఉండకపోవచ్చును..ఇక మరణించిన వారిలో ఐదారుగురు మినహాయిస్తే మిగిలిన వారంతా విడుదలైన జాబితా పరిశీలన చేస్తే అంతాగిరిజనులే..? మావోయిస్టు అగ్రనేత బస్వరాజు గా గత యాభై ఏళ్ళుగా ఉద్యమానికి సర్వస్వం త్యాగం చేసిన నేతగా, మంచి వ్యూహకర్తగా కేశవరావు కు పేరుంది.అయితే,ఇక్కడే ఒక విషయం గమనించాలి. సరిహద్దుల్లో యుద్ధం జరిగితే శత్రుదేశాల సైనికులు గాయపడితే చికిత్స చేసి జైలులో నిర్భంధం విధిస్తారు! పరస్పరం దాడిలో ప్రాణం కోల్పోయిన సందర్భంలో విధినిర్వహణలో మరణించిన సైనికులను ప్రత్యర్ధి సైనికులు గౌరవిస్తారు.కానీ, ఇదెక్కడి ద్వేషమో కొత్తరకం ట్రైండ్, అమానవీయత కనిపిస్తుంది.మరణించిన నక్సల్స్ అగ్రనేత మృత దేహం తో పాటు,26మృతదేహాలు ఒకచోట పేర్చి , వాటి వెనుక నిలబడి తుపాకులు గాలిలో ఊపుతూ,అరుస్తూ కేకలు వేయడం, నృత్యాలు చేయడం కొన్ని చానళ్ళు,సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
నిజంగా ఇదెక్కడి సాంప్రదాయం? ఇదెక్కడి మానవీయత?? శవాలు ముందు నృత్యం చేయడాన్ని మన పురాణాల ప్రమాణాల్లో చూస్తే రాక్షస క్రీడ గా చెప్పుకుంటాము. నిజంగా ఆ పనిచేసింది సైనికులేనా?అనుమానాలు ఉన్నాయి. స్థానిక నక్సలైట్ ఉద్యమం నుండి కోవర్టులుగా మారి పోలీసులు గా ఉద్యోగాల్లో చేరిన నక్సల్స్ వేటలో కీలక భూమిక నిర్వర్తించిన జవాన్లు అయి ఉండవచ్చుననే అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి అమానవీయ దృశ్యాలు ఎవరు చేసినా మన సైన్యం పేరుతో జరిగినా క్రమశిక్షణకు , సైనిక న్యాయం కు,సాంప్రదాయాలకు కొన్ని తప్పుడు సంకేతాలు చూపబడతాయి? అది మన చరిత్రకు మాయని మచ్చ? ఏదిఏమైనా శవాల ముందు చేసిన నృత్యాలు,ఆ పిశాచానందం ప్రజలు ఎవరూ హర్షించ లేరు? ఏది ఎలా ఉన్నా ఎలా మరణించినా శత్రృవు అయినా శవాలను గౌరవించి సాదరంగా అంత్యక్రియలు జరిపే సనాతన సాంప్రదాయం మనది! ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన అలాంటి అమానవీయ సంఘటన మరొకటి జరగకూడదని ఆశిద్దాం! మన బారతీయ సంస్కృతి, సాంప్రదాయం గౌరవిద్దాం!నిలబెట్టుకుందాం!!

సెల్:9441864514.ఇమెయిల్; thirmal.1960@gmail.com,