-సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఎంపి అర్వింద్ ఆగ్రహం
న్యూదిల్లీ, ఆగస్ట్ 4 : ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం సరైనది కాదని అన్నారు. విద్యాశాఖ బాధ్యతలను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ఎవరి సహకారం లేకుండా రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు నింపగలరా అని ఎంపీ అరవింద్ సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కూడా లేవని ఆరోపించారు. కొన్ని పాఠశాలల్లో బ్లాక్ బోర్డులు, చాక్ పీసులు, విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం ఒక్క ప్రభుత్వ పాఠశాలను అయినా సందర్శించారా అని ప్రశ్నించారు. ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేయకుండా కొత్త పాఠశాలల నిర్మాణం పేరుతో ప్రభుత్వం కమీషన్ల కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అరవింద్ డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు