రాములమ్మ భర్తకు బెదిరింపులు

వనజీవి రామయ్య మృతికి భట్టి, పొంగులేటి సంతాపం
హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌12: ‌ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య  మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి,బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.  వనజీవి రామయ్య మృతి రాష్టాన్రికి, దేశానికి తీరని లోటని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆయన జీవితం భవిష్యత్‌ ‌తరాలకు స్ఫూర్తి అని చెప్పారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటి మొక్కల ప్రధాత మృతి ప్రకృతి ప్రేమికులకు తీరని లోటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. వనజీవి రామయ్య ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. వనజీవి మృతిపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌వద్దిరాజు రవిచంద్రం సంతాపం వ్యక్తంచేశారు.

పద్మశ్రీ వనజీవి రామయ్యను కోల్పోవడం చాలా బాధాకరమని మాజీ ఎంపీ సంతోష్‌ ‌కుమార్‌ అన్నారు. చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన ప్రకృతి యోధుడని చెప్పారు. రామయ్య కుటుబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వనజీవి మృతిపట్ల సిద్దిపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు సంతాపం తెలిపారు. ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య మృతి తీరని లోటన్నారు.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించి, మొక్కలను బిడ్డలవలే పెంచారు. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారు. పర్యావరణ హితమే తన ఊపిరిగా భావించిన ఆయన, ఆరోగ్యం సహకరించకున్నా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదు. వారి జీవితం భవిష్యత్‌ ‌తరాలకు స్ఫూర్తి. అలాంటి గొప్ప వ్యక్తి వనజీవి రామయ్య నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page