కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ పిలుపు
కొత్తగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగే రెండు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఇడంపాక శ్రీశైలం, జిల్లా నాయకులు బూర్కా వెంకటయ్య కోరారు. ఈమేరకు శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించారు. సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఇడంపాక శ్రీశైలం, జిల్లా నాయకులు బూర్కా వెంకటయ్య మాట్లాడుతూ.. సిపిఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ రెండు విప్లవ పార్టీలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా విలీనమవుతున్నాయని తెలిపారు.
చండ్ర పుల్లారెడ్డి రూపొందించిన ప్రజాయుద్ధ పంధా ప్రతిఘటన పోరాటలను మరింత ముందుకు తీసుకుపోవడానికి మరింత బలమైన ప్రజాఉద్యమాన్ని నిర్మించడానికి విలీనం దోహదపడుతుందని అన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రెండు న్యూడెమోక్రసీ పార్టీల కార్యకర్తలు నేటి సభకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కమిటీ నాయకులు కొట్టెం అచ్చన్న, గట్టి సురేందర్, యాదగిరి యుగంధర్, గజ్జి సోమన్న, బుర్కా బుచ్చిరాములు, గజ్జి లింగన్న, పసునూరి రాజమల్లు, అడ్డూరి వెంకన్న, పివైఎల్ మండల కార్యదర్శి తాళ్లపల్లి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.