– కాళేశ్వరం వివాదంలోకి నన్ను లాగే యత్నం
-సుమోటాగా కమిషన్ ముందు హాజరవుతా
-మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కాళేశ్వరం వివాదంలోకి తనను కావాలని లాగుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి ఈటల అబద్ధాలు చెప్పారన్నారు. సబ్ కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదని మేడిగడ్డ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన తర్వాత కమిషన్ వేశారని చెప్పారు. కాళేశ్వరం విషయంలో మాజీ మంత్రి ఈటల చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్ ముందు ఈటల అబద్ధాలు చెప్పాల్సిన అవసరమేంటి? ఈటల ఆనాలోచితంగా వాంగ్మూలం ఇచ్చారా? అలాంటి పరిస్థితులు వొచ్చాయా? తప్పుడు ప్రకటనలతో ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరు. కాళేశ్వరంపై సబ్ కమిటీ ఎప్పుడూ నివేదిక ఇవ్వలేదు. వివరాలన్నీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను. నేను సుమోటోగా కమిషన్ ముందుకు వెళ్తాను. ప్రాణహితపై మాత్రమే స్టేటస్ రిపోర్టు ఇచ్చాం. పెండింగ్ ప్రాజెక్టులపై మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కమిషన్ వేసిందని తుమ్మల స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటనలతో ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరన్నారు.
తాను సుమోటోగా కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్తానని మంత్రి తెలిపారు. కాళేశ్వరంపై సబ్‌కమిటీ- ఎప్పుడూ నివేదిక ఇవ్వలేదని.. అందుకు సంబంధించిన వివరాలన్నీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ప్రాణహితపై మాత్రమే స్టేటస్ రిపోర్టు ఇచ్చామని.. పెండింగ్ ప్రాజెక్టులపై మాత్రమే కమిషన్ వేశారని పేర్కొన్నారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈటల పొంతనలేని సమాధానం ఇచ్చారని, ఆయన చెప్పిన సబ్ కమిటీ-.. కాళేశ్వరం కోసం వేసింది కాదన్నారు. కాళేశ్వరానికి అనుమతి ఇచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టుల కోసం వేసిన సబ్ కమిటీ- అదని తుమ్మల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ప్రాణహిత, దేవాదుల, కాంతలపల్లి, తుపాకుల గూడెం పనుల కోసం సబ్ కమిటీ- వేశారని మంత్రి తుమ్మల అప్పటి బీఆర్‌ఎస్ పాలనా సమయంలో జరిగిన విషయాల్ని గుర్తు చేసుకున్నారు. ఆ సబ్ కమిటీ కాళేశ్వరం బ్యారేజీలపై ఎలాంటి నివేదిక ఇవ్వలేదని.. కాళేశ్వరం నిర్మాణానికి సబ్ కమిటీ- ఆమోదం తెలిపిందనడం అబద్ధమని మంత్రి చెప్పారు. కాళేశ్వరం కేబినెట్ ఆమోదం పొందలేదని మంత్రి తుమ్మల తేల్చిచెప్పారు.





