“బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఆత్మగౌరవంతో రాజులా బతికామని,ఇంట్లో ఉండి పనులు చేయించుకున్నామని, ఫోన్‌లో జీఓ లు వచ్చాయని ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాక బానిసల కంటే దారుణంగా తమ బతుకులు మారాయని ఆవేదన చెందుతున్నారట. సీఎం కలవడు..కనీసం ఆపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని..మంత్రులైతే అసలు ఫోనే ఎత్తడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారట..”
తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయన్నట్లు రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయం మారుతోంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్స్‌పై దృష్టిపెట్టకుండా ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే ఎజెండాకు పాలనలో ప్రాధాన్యత ఇచ్చింది. బీఆర్ఎస్‌ను చీల్చడంపై ప్రభుత్వ పెద్దలు ఫోకస్ పెట్టారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా బీఆర్ఎస్‌ను చీల్చి, కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రయత్నం చేశారు..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని, కాంగ్రెస్ సీనియర్ నేతలపై ముసలి తనంలో ఫిరాయింపులేంటని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు.
గాంధీ భవన్ గేట్లు తెరిచాం..బీఆర్ఎస్‌లో కేసీఆర్ కేటీఆర్ హరీష్‌రావు తప్ప ఒక్కరు మిగలరని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు.ఎన్నికల హామీలు గాలికి వదిలేసి మొదటి ఏడాది మొత్తం ఫిరాయింపులపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు.పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సామ, దాన, భేద, దండోపాయాలతో పది మంది ఎమ్మెల్యేలను పది మంది ఎమ్మెల్సీలను రేవంత్ కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు.
పార్టీ ఫిరాయింపు నేతలతో బీఆర్ఎస్‌ను, కేసీఆర్ మానసికంగా ఇబ్బంది పెట్టే ఎజెండాను రేవంత్ రెడ్డి అమలు చేశారు..ప్రభుత్వంలో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలరింగ్ ఇచ్చారు. అంతేకాదు వారి నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు ఇస్తున్నట్లు ప్రకటనలు చేశారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయం చెప్పారు. అధికార పార్టీలో ఉంటే నిధులు వస్తాయని, నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని, గౌరవం పెరుగుతుందని, అధికారులు సెల్యూట్ చేస్తారని చెప్పారు. అధికారపార్టీలో ఉంటేనే నియోజకవర్గం అభివృద్ది చెందుతుంది ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.
అయితే గత కొంతకాలంగా తెలంగాణలో రాజకీయాలు డైనమిక్‌గా మారాయి.మరీ ముఖ్యంగా రెండు అంశాలు రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశంలో కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకటి రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలో నేతల వలసలు జోరందుకుంటే..రెండోది ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలో చేరిన ఫిరాయింపు నేతల పరిస్థితి, అక్కడ వారి దుస్థితి రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
అయితేనాడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కండువాలు కప్పి కాంగ్రెస్‌లో ఆహ్వానించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలామారింది..కనీసం వాళ్లు ఏ పార్టీలో ఉన్నారో క్యాడర్‌కు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు.పుట్టింటోళ్ళు తరిమేసారు. కట్టుకున్నోడు వదిలేసాడు అన్నట్లు పార్టీ మారిని ఎమ్మెల్యేల పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు అక్కడ ఉక్కపోతతో ఉడికిపోతున్నారు..పదేళ్లు బీఆర్ఎస్ హయాంలో ఆత్మగౌరవంతో బతికిన ఆ ఎమ్మెల్యేలు ఆత్మగౌరవాన్ని చంపుకుని బానిసల్లా బతుకున్నారు..పార్టీలో ఆహ్వానించే ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన గౌవరం ఇప్పుడు ఇవ్వడం లేదు..గంజిలో ఈగలా తీసేస్తున్నాడని సన్నిహితుల దగ్గర తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు బలమైన కార్యకర్తలు, సానుభూపతి పరులు, క్యాడర్‌తో బలంగా ఆయా నియోజకవర్గంలో బలమైన నేతగా కనిపించి ఫిరాయింపులు తరువాత ఇప్పుడు ఒంటరయ్యారు..పార్టీకి ద్రోహం చేసి, క్యాడర్‌కు నమ్మక ద్రోహం చేసి పార్టీ శ్రేణుల కష్టంతో బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్‌లో చేరడంపై గులాబీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉంటే..మరోవైపు కాంగ్రెస్ క్యాడర్, నేతలు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నియోజకవర్గంలో భగ్గున మండుతున్నారు..దీంతో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టించుకోకపోవడంతో కోరలు తీసిన పాముల్లో బలహీనమైన నేతల్లా తయారయ్యారు.
దీంతో అధికార పార్టీలో చేరి అందల మెక్కి, అధికారన్ని అనుభవించడమే కాదు..ఆధిపత్యం చేలాయించాలని కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ చచ్చిన పేనుల ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసన్ని చంపుకుని బానిసలుగా బతుకున్నారు..సీఎం పట్టించుకోవడం లేదు..పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలు, స్వప్రయోజనాలు నేరవేర్చడం లేదు..వెరిసి అక్కడ అవమానాలు, అవహేళనలు ఎదుర్కోవల్సి వస్తుందని కార్యకర్తల వద్ద వాపోతున్నారట.
బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఆత్మగౌరవంతో రాజులా బతికామని,ఇంట్లో ఉండి పనులు చేయించుకున్నామని, ఫోన్‌లో జీఓ లు వచ్చాయని ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాక బానిసల కంటే దారుణంగా తమ బతుకులు మారాయని ఆవేదన చెందుతున్నారట. సీఎం కలవడు..కనీసం ఆపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని..మంత్రులైతే అసలు ఫోనే ఎత్తడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారట.
మొన్నటికి మొన్న కాంగ్రెస్‌లో చేరిన గుడెం మహిపాల్ రెడ్డి తన ఆవేదన కార్పొరేషన్ ఎన్నికల ముందు బహిరంగంగానే వెళ్లబోసుకున్నారు.నియోజకవర్గం అభివృద్ది కోసం కాంగ్రెస్ కండువ కప్పుకుంటే ఆ కండవే తనకు ఉరితాడైందని , కాంగ్రెస్‌లో కనీసం గౌరవం లేదని, నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి పైసా ఇవ్వలేదని వెరసి అనేక అవమానాలు ఎదుర్కొవల్సి వచ్చిందని క్యాడర్ దగ్గర భావోద్వేగానికి గురయ్యారు..బీఆర్ఎస్‌తోనే తెలంగాణాభివృద్ది సాధ్యమని, కేసీఆర్‌తోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేసారు. అంతేకాదు తన నియోజకవర్గంలో అన్ని కార్పొరేషన్లును గెలిపించారు.. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచేందుకు కృషి చేశారు.రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తూ అన్ని మున్సిపాలిటీలలో గులాబీ జెండా ఎగిరేలా చేశారు..అంతేకాదు బుల్లెట్ దిగిందా లేదా అని రేవంత్ రెడ్డిని పరోక్షంగా హచ్చరించారు కూడా.
ఒక్క గూడెం మహిపాల్ మాత్రమే కాదు..బీఆర్ఎస్‌కు ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ఇదే..గూడెం మహిపాల్ రెడ్డి డైనమిక్ లీడర్ కాబట్టి రేవంత్‌ను కాంగ్రెస్‌ను డైరెక్ట్ ఎదిరించారు..కానీ మిగతా వారు వ్యక్తిగత బలహీనతలతో ఇంకా గాంధీ భవన్ గడీల్లో, జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో బానిసలుగా ఉంటున్నారు.
బీఆర్ఎలో గెలిచి కాంగ్రెస్‌లో చేరి, ప్రభుత్వ సలహదారుడిగా ఉన్న పోచారం శ్రీనివాస రెడ్డి కూడా అక్కడ ఉక్కపోత, అవమానాలను భరించలేక తాజాగా బటయకు వచ్చి కాంగ్రెస్‌పై, రేవంత్ రెడ్డిపై, మంత్రులపై విమర్శలు చేస్తున్నారు.పార్టీ మారి అధికార పార్టీలో చేరిన కాంగ్రెస్‌లో కనీసం గౌరవం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ముద్దగా లక్ష్మీ పుత్రుడుగా పిలిచే పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి కాంగ్రెస్‌లో గంజిలో ఈగ అయింది..లక్ష్మీ పుత్రుడి మనోవేదన అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పోచారంకు పార్టీలో బయట కూడా చాలా గౌరవం ఉండేది. ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ నేతలు మంత్రుల కాళ్ళుమొక్కాల్సిన దుస్థితి ఏర్పడింది.నియోజకవర్గ అభివృద్ధి, ఎక్కువ నిధులు విడుదల కోసం..అంటూ కాంగ్రెస్ పార్టీలో చేరిన తల్లిలాంటి బీఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిచిన అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి పోచారం శ్రీనివాసరెడ్డి దుస్థితి ఒక ఉదాహరణ.ఒక హెచ్చరిక కూడా.
పార్టీ మారినా పది ఎమ్మెల్యేల్లో ఒక్క పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి మాత్రమే కాదు. అందరి దుస్తుతి ఇదే..మొన్న గూడెం మహిపాల్ రెడ్డి..ఇవాళా పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి రేపు ఇంకొకరు. భవిష్యత్తు లో అందురూ రియలైజ్ కావాల్సిందే. చేసిన తప్పుకు చింతించాల్సిందే..ఇది రియలైజేషన్ కాదు కర్మఫలం.ఆత్మగౌరవం చంపుకుని బానిసలుగా బతకడం. ఒక్క పోచారం పరిస్థితి కాదు..కేకే పరిస్థితి కూడా రెంటికిచెడ్డ రేవడిలా మారింది..కేసీఆర్ కేకేకు రాజ్యసభతో పాటు ప్రభుత్వ సలహదారుడి పదవి ఇచ్చి పార్టీ జనరల్ సెక్రటరీగా కేసీఆర్ స్థానాన్ని ఇచ్చి గౌరవించారు…కాంగ్రెస్‌లో కేకే పరిస్థితి గంజిలో ఈగకంటే దారుణంగా తయారైంది. అక్కడ కనీసం గౌరవం ఇవ్వడం లేదు..తన అవమానాన్ని బయటకు చెప్పుకోలే.తనలో దాచుకోలేక నిత్యం తనతో తానే యుద్దం చేస్తున్నారు.
ఇలా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు నమ్మక ద్రోహం చేసి అధికారం పదవుల కోసం కాంగ్రెస్‌లో చేరిన అందరి పరిస్థితి ఇలా ఉంది..కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు.. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాల్లో కేకే, పోచారం వంటి అనేక మంది నేతలు సమిధలవుతున్నారు. అయితే కేసీఆర్ పార్టీ మారిన బీఆర్ఎస్ నేతలతో రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తే..దెబ్బకు దెబ్బా అన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. అంతేకాదు, పార్టీ మారిని ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ పాలనపై విమర్శలు చేసి కాంగ్రెస్‌లో చేరారో ఇప్పుడు అదే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ వద్దు బీఆర్ఎస్ ముద్దు అనే విధంగా ప్రకటనలు వచ్చేలా కేసీఆర్ స్ట్రాటజీగా వ్యవహరిస్తున్నారు..ఏ పార్టీ మారిని ఎమ్మెల్యేలైతే బీఆర్ఎస్ సర్కార్‌ను, కేసీఆర్ పాలనపై విమర్శలు చేశారో..ఇప్పుడు అదే ఎమ్మెల్యేల నోటా బీఆర్ఎస్ పాలన బాగుంది..కేసీఆర్ అద్భతంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేరాని చెప్పేలా చేశారు..
-తోటకూర రమేష్





