తెలంగాణ భవన్ ను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
మణుగూరులో హై టెన్షన్…
తెలంగాణ భవన్ లో ఫర్నిచర్ ను దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు
మణుగూరు, ప్రజాతంత్ర, నవంబర్ 02: మణుగూరు మండలంలోని తెలంగాణ భవన్ వద్దా హై టెన్షన్ నెలకొంది. . గత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది ఎమ్మెల్యే అయిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి మారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ భవన్ గా మార్చేశారు. పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యాలయం కోసం ఆందోళనలు చేసినప్పటికీ ఎటువంటి ఫలితాలు లభించకపోవడంతో ఆదివారం వందల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలంగాణ భవన్ వద్దకు చేరుకొని కార్యాలయంలోని ఫర్నిచర్ అంతా బయటపడేసి పెట్రోల్ పోసి తగలబెట్టడంతో పెద్ద మంటలు వ్యాపించాయి.

వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. తెలంగాణ భవన్ పై ఎగురుతున్న టిఆర్ఎస్ జెండాను తీసివేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను వివరణ కోరగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యాలయం ఆక్రమించుకొని తెలంగాణ భవన్ గా మార్చేశారని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యాలయం ఆక్రమించుకొని తెలంగాణ భవన్ గా మార్చేశారని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరం ఐకమై తమ కార్యాలయం తమ హస్తగతం చేసుకున్నామన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి సిఐ నాగబాబు,అశోక్ రెడ్డి సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను అదుపు చేశారు.





